Travel:ట్రెక్కర్స్ కు స్వర్గధామం భూటాన్

సాహసప్రియులకు భూటాన్ ద్వారాలు తెరచింది. 60 ఏళ్ల తర్వాత ట్రాన్స్ భూటాన్ ట్రైల్‌ని తిరిగి ప్రారంభించామని ప్రకటించింది. భూటాన్ ఇటీవలే అంతర్జాతీయ బోర్డర్లు ఓపెన్ చేసి పర్యాటకులకు స్వాగతం పలుతుకుతోంది.

New Update
Travel:ట్రెక్కర్స్ కు స్వర్గధామం భూటాన్

ఈ ట్రాన్స్ భూటాన్ ట్రైల్ అనేది ఒక అందమైన సాహస యాత్ర. మొత్తం 403 కీలోమీటర్ల దూరం ఉన్న ఈ మార్గం తూర్పు భూటాన్‌‌లోని ట్రాషిగాంగ్‌ - పడమర దిక్కున ఉన్న హా అనే పవిత్ర స్థలాన్ని కలుపుతుంది. ఇక్కడ ప్రయాణిస్తే... పర్యాటకులు భూటాన్ సంస్కృతి సంప్ర‌దాయాలు, చారిత్ర‌క విశేషాలు, ప్ర‌జ‌ల జీవ‌న‌శైలికి సంబంధించిన అనేక విషయాలను తెలుసుకోవచ్చుట.

ఇది ఇంతకు ముందే ఉండేదని చెబుతున్నారు ఇక్కడ స్థానికులు. 16వ శతాబ్దం నుంచి 1960ల వరకు భూటాన్‌లో ప్రధాన మార్గంగా సేవలు అందించింది అంటున్నారు. దేశంలో ఏ మూలన ఉన్న వాళ్లతోనైనా ఈ మార్గం నుంచే సంప్రదింపులు జరిగేవి. అలా ఇది టూరిస్టులకు, మెస్సెంజర్లకు, ఆర్మీ, వర్తకులకు చాలా ఉపయోగంగా ఉండేదిని అంటున్నారు. కానీ, తర్వాతి కాలంలో ఈ ట్రాన్స్ భూటాన్ ట్రైల్ అనే మార్గం పెద్దగా ఉపయోగంలో లేకపోయింది.

ఇప్పుడు దీన్ని భూటాన్ కెనాడా ఫౌండేషన్ అనే నాన్ ప్రాఫిటబుల్ స్వచ్ఛంద సంస్థ ఆధునీకరించి తిరిగి ఈ మార్గాన్ని ప్రారంభించింది. దీంతో టూరిస్టులు అంతదూరం మొత్తం నడుచుకుంటూ వెళ్లొచ్చు లేదా బైక్ రైడింగ్‌లోనూ వెళ్లే సౌకర్యాలను కల్పిస్తోంది. దీని కోసం వివిధ ప్యాకేజీలు అందిస్తోంది. వీటి ద్వారా వచ్చే ఆదాయం మొత్తం ఈ ట్రాన్స్ భూటాన్ ట్రైల్‌ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ఉపయోగిస్తామని ఆ సంస్థ ఛైర్మన్ సామ్ బ్లిత్ వెల్లడించారు.

ఇక ఈ ట్రాన్స్ భూటాన్ ట్రైల్‌ను అందుబాటులోకి తేవడంతో అది స్థానికులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే వీలుందని కూడా అంటోంది ఇక్కడి ప్రభుత్వం. ఇది తూర్పు, పడమర ప్రాంతాలను కలిపే ప్రధాన మార్గం కావడంతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలు అనేక వ్యాపారాలు చేసుకోవచ్చని చెబుతోంది. మొత్తానికి ఈ ట్రైల్స్ వల్ల స్వామికార్యం, స్వకార్యం కూడా జరుగుతుంది అన్నమాట.

Advertisment
తాజా కథనాలు