Bhumi : ఆ క్యారెక్టర్ నా మెంటల్ హెల్త్ పై ప్రభావం చూపింది.. భూమీ పెడ్నేకర్

‘భక్షక్‌’ సినిమాలో తాను పోషించిన విశాలీ సింగ్‌ పాత్రపై భూమీ పెడ్నేకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ పాత్ర తన మానసిక స్థితిని మెరుగుపరిచిందని చెప్పింది. మనసు నిండా ఆనందాన్ని నింపే ఇలాంటి పాత్రలు అరుదుగా వస్తుంటాయని మురిసిపోతుంది.

New Update
Bhumi : ఆ క్యారెక్టర్ నా మెంటల్ హెల్త్ పై ప్రభావం చూపింది.. భూమీ పెడ్నేకర్

Bhumi Pednekar : బాలీవుడ్(Bollywood) బ్యూటీ భూమీ పెడ్నేకర్(Bhumi Pednekar) ‘భక్షక్‌’లో తాను పోషించిన పాత్రపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇలాంటి గొప్ప క్యారెక్టర్లు అరుదుగా లభిస్తాయని, నిజంగా ఈ పాత్ర తన మానసిక స్థితిని మెరుగుపరిచిందంటూ తన మనసులో మాట బయటపెట్టింది.

ఇదో విభిన్నమైన అనుభవం..
ఈ మేరకు వాస్తవ సంఘటనల ఆధారంగా పులకిత్‌ తెరకెక్కించిన ‘భక్షక్‌’ ఇటీవల ఓటీటీ(OTT) లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మూవీలో విశాలీ సింగ్‌గా నటించిన భూమి విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ క్రమంలోనే రీసెంట్ ఇంటర్వ్యూలో సినిమా ముచ్చట్లు షేర్ చేసుకుంది. ఇదో విభిన్నమైన అనుభవం. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఈ సినిమా అలరిస్తుండటం చాలా ఆనందంగా ఉందని చెప్పింది.

ఇది కూడా చదవండి : Samantha : ఐకాన్‌ స్టార్‌ను తెగ పొగిడేస్తున్న సామ్.. మతలబేంటో తెలుసా!

మనసు నిండా ఆనందం..
అలాగే సోషల్ మీడియా(Social Media) లో తనపై ప్రశంసల వర్షం కురుస్తుందని, ఇంతటి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు టీమ్‌ తరపున కృతజ్ఞతలు చెప్పింది. 'ఇలాంటి సందేశాత్మక చిత్రాల్లో నటించడం నాకిష్టం. బ్యాంక్‌ బేలన్స్‌ నింపే పాత్రలు తరచూ వస్తూనేవుంటాయి. కానీ మనసు నిండా ఆనందాన్ని నింపే పాత్రలు మాత్రం అరుదుగా వస్తుంటాయి. ఇది అలాంటి పాత్ర' అంటూ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం భూమీ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు