టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త చైర్మన్ ఎన్నికైన్నారు. వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం పూర్త కావటంతో. వైవీ స్థానంలో కొత్త చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డిని నియమించింది వైసీపీ ప్రభుత్వం.

New Update
TTD : టీటీడీపై అవాస్తవ విమర్శల దాడి.. భూమన కరుణాకర రెడ్డి షాకింగ్ కామెంట్స్..!

కొత్త చైర్మన్‌గా..

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి నియమితులయ్యారు. సీఎం జగన్‌ ప్రభుత్వం భూమనను ఎంపిక చేసింది. ఇప్పుడున్న చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ఇంకో వారం రోజుల్లోపే ముగియనునంది. దీంతో..కొత్త చైర్మన్‌ నియామకంపై సమాలోచనలు చేసిన ప్రభుత్వం భూమనను నియమించింది. అంతేకాకుండా దివంగత వైఎస్సార్‌ హయాంలో 2006 నుండి 2008 వరకు టీటీడీ చైర్మన్‌గా భూమన పని చేశారు. ప్రస్తుత చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి 2019లో ఆ బాధ్యతలు చేపట్టారు. ఇక ప్రస్తుతం చైర్మన్‌తో పాటు టీటీడీలో 35 మంది పాలక సభ్యులు ఉన్నారు.

పదవిని ఖరారు చేసిన సీఎం జగన్

ఆగస్టు 12న సుబ్బారెడ్డి పదవీ కాలం ముగియనుంది. వైవీ స్థానంలో మాజీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డికి టీటీడీ చైర్మన్ పదవిని ఖరారు చేశారు. సీఎం జగన్‌తో తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి గత నేల సమావేశమయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన్ను కలిసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని.. తిరుపతి టికెట్‌ తన కుమారుడికివ్వాలని భూమన కోరినట్లు వైసీపీ వర్గాలు తెలిపారు. గతంలో టీటీడీ చైర్మన్‌గా పని చేసిన భూమన.. మళ్లీ ఈ పదవి తనకు ఇవ్వాలని సీఎం జగన్‌ను కోరారు.

చైర్మన్ పదవి రేసులో నలుగురు పోటీ

అయితే... ఈ టీటీడీ చైర్మన్ పదవి రేసులో నలుగురు పోటీ పడ్డారు. వైవీ స్థానంలో బీసీని చైర్మన్ చేయాలని భావించింది వైసీపీ. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితులు భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, బీసీ కోటాలో మాజీ మంత్రి కొలుసు పార్థసారధి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేర్లు పేర్లు కూడా వినిపించాయి. ఈ నలుగురిలో మాత్రం కొత్త చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డికి దక్కింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు