Akhila Priya: అఖిలప్రియ బాడీగార్డ్‌పై హత్యాయత్నం కేసులో ట్విస్ట్..! ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అఖిలప్రియ బాడీగార్డ్‌పై హత్యాయత్నం కేసులో మరో కారును గుర్తించారు. ఈ క్రమంలో దాడి చేయించిన వారికి అఖిలప్రియ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ కేసులో న్యాయం జరగకపోతే తప్పకుండా తన టైమ్ వస్తుందని.. అప్పుడు అన్నిటికీ సమాధానం చెప్తానని హెచ్చరించారు. By Jyoshna Sappogula 16 May 2024 in ఆంధ్రప్రదేశ్ కర్నూలు New Update షేర్ చేయండి Bhuma Akhila Priya: ఆళ్ళగడ్డ మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అఖిలప్రియ బాడీగార్డ్‌పై హత్యాయత్నం కేసులో ట్విస్ట్ నెలకొంది. దాడికి వచ్చిన రెండో కారును గుర్తించారు. తొలుత ఒకకారులోనే వచ్చారని భావించిన అఖిలప్రియ..పరారైన దుండగుల వెనుకే వచ్చిన మరో కారును గుర్తించారు. అయితే, ఆ కారులో వచ్చింది ఎవరనే దానిపై సస్పెన్స్ నెలకొంది. Also Read: వైసీపీ-టీడీపీ కార్యకర్తల ఇళ్లలో పెట్రోల్ బాంబులు.. దాడుల కుట్రల వెనుక.. మరోవైపు దాడి చేయించిన వారికి అఖిలప్రియ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాంట్రాక్ట్ మర్డర్లు చేసే రౌడీషీటర్స్ టౌన్లోకి దిగారని.. ఆ రౌడీషీటర్లనే కొత్తపల్లిలో ఏజెంట్లుగా కూర్చోబెట్టాలని.. గంగుల కిశోర్‌రెడ్డి ప్రయత్నించాడన్నారు. గంగుల కిషోర్ రెడ్డి వెంట పోలింగ్ రోజు నంద్యాల రౌడీషీటర్లు ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. ఏవి సుబ్బారెడ్డి , మరికొందరిపై 307 SC, ST కేసు నమోదైందని.. న్యాయం జరగకపోతే తప్పకుండా తన టైమ్ వస్తుందని.. అప్పుడు అన్నిటికీ సమాధానం చెప్తానని హెచ్చరించింది. &; #bhuma-akhila-priya మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి