అఖిల ప్రియ నీ ఆటలు నా దగ్గర సాగవు! | Vijaya Dairy Chairman Fires On Bhuma Akhila Priya | RTV
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మార్కెట్ యార్డులో తక్కువ ధరలకే నిత్యావసర అమ్మకాలు ప్రారంభించారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఒక్కొక్కరికి కేజీ కందిపప్పు, ఐదు కేజీల బియ్యం ఇస్తారని తెలిపారు.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.మంగళవారం టీడీపీ నేత ఏవీ భాస్కర్ రెడ్డి, ఆయన సతీమణి శ్రీదేవిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో శ్రీదేవి చనిపోగా.. తీవ్ర గాయాలైన భాస్కర్ రెడ్డి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అఖిలప్రియ బాడీగార్డ్‌పై హత్యాయత్నం కేసులో మరో కారును గుర్తించారు. ఈ క్రమంలో దాడి చేయించిన వారికి అఖిలప్రియ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ కేసులో న్యాయం జరగకపోతే తప్పకుండా తన టైమ్ వస్తుందని.. అప్పుడు అన్నిటికీ సమాధానం చెప్తానని హెచ్చరించారు.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమా అఖిలప్రియ బాడీ గార్డుపై జరిగిన హత్య ఘటనతో ఆళ్లగడ్డ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నలుగురికి మించి ఎక్కడా గుంపులుగా ఉండొద్దు అంటూ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.