రోడ్డెక్కిన విద్యార్థులు.. టీచర్‌ కావాలని డిమాండ్..!

ప్రభుత్వం చెబుతోంది ఒకటి అమలు చేస్తోంది మరోటిలా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలు, యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం గ్రామస్థాయిలో ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులను కేటాయించడంలేదు. విద్యార్థులు అధికంగా ఉన్న పాఠశాలల్లో ఒక్క ఉపాధాయుడు మాత్రమే ఉంటున్నాడు. ఆ ఒక్క ఉపాధ్యాయుడు కూడా సరిగ్గా పాఠశాలకు రాకపోవడంతో విద్యార్థుల చదువుకు ఇబ్బందిగా మారింది

New Update
రోడ్డెక్కిన విద్యార్థులు.. టీచర్‌ కావాలని డిమాండ్..!

Bhavanipeta students protested: కామారెడ్డి జిల్లా లింగంపేట మండల పరిధిలోని భవానిపేటలో విద్యార్థులు రోడ్డెక్కారు. మండల ప్రాథమిక పాఠశాలలో 95 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా.. ఆ పాఠశాలలో ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నాడు. అతను కూడా ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటి నుంచి సరిగ్గా పాఠశాలకు రావడం లేదు.దీంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు చదువుచెప్పే నాథుడే కరువయ్యాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు ఆందోళన చేపట్టారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి తమకు టీచర్‌ కావాలి, విద్యాధికారుల నిర్లక్ష్యం నశించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

Bhavanipeta students protested: సీఎం కేసీఆర్‌ విద్యా వ్యవస్థకు పెద్దపీట వేసినట్లు, రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలు ఏర్పాటు చేసి, విద్యా రంగాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెబుతోన్నారని మండిపడ్డారు, కార్పొరేట్‌ స్కూళ్లతో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడుతున్నాయని గొప్పలు చెబుతున్న కేసీఆర్‌.. గ్రామ స్థాయిలోని పాఠశాలలకు మాత్రం ఉపాధ్యాయులను కేటాయించలేకపోతోన్నారన్నారు. కేసీఆర్‌ తన క్యాబినెట్‌లో పేరుకే మంత్రులను కేటాయించారని, కానీ అన్ని శాఖలపై ఆయనే అధికారం చెలాయిస్తున్నారని ఆరోపించారు. గ్రామ స్థాయిలో మెరుగైన విద్యా వ్యవస్థ ఉంటేనే కాలేజీ స్థాయిలో విద్యార్థులు వారి ప్రతిభను కనబర్చుతారన్నారు.

తమ గ్రామంలో ఉన్న పాఠశాలలో 95 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. విద్యార్థులకు ఒక్క ఉపాధ్యాయుడే ఎలా చదవు చెబుతాడని గ్రామస్తులు ప్రశ్నించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య బట్టి ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలన్నారు. పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించాలని పలుమార్లు మండల విద్యాధికారికి, జిల్లా విద్యాధికారికి వినతి పత్రాలు సమర్పించినా తాము చెప్పేది పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాలుగా ఉన్నతాధికారుల వద్ద మొర పెట్టుకుంటున్నా.. ఎలాంటి స్పందన లేకపోవడంతో కలెక్టర్‌ను కలవడానికి వచ్చినట్లు తెలిపారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి భవానిపేటలో పాఠశాలకు ఉపాధ్యాయులకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు