Deputy CM Bhatti Vikramarka : భద్రాద్రి పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ(Telangana) లోని మహిళకు తీపి కబురు అందించారు. త్వరలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) హయాంలో తెలంగాణలోని మహిళలను మహాలక్ష్మిగా చూసుకుంటామని అన్నారు. తెలంగాణలో కొలువుదీరిన రోజునే మొదటిగా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి ఎన్నికల సమయంలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం(RTC Bus Free Journey) కల్పిస్తామని చెప్పిన హామీను నెరవేర్చమని అన్నారు. మహాలక్ష్మి పథకం(Mahalakshmi Scheme) కింద రాష్ట్రంలోని మహిళలు ఆర్టీసి బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ పథకం వల్ల చాలా సంతోషంగా ఉన్నామని మహిళలు చెబుతున్నారని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో జీతాలు సకాలంలో అందని ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బందికి సకాలంలో జీతాలు పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం లాగా తమ ప్రభుత్వం హామీలు చెప్పి అమలు చేయకుండ ఉండదని పేరొన్నారు. తమది ప్రజల ప్రభుత్వమని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం పని చేసే ప్రభుత్వం అని అన్నారు. కాంగ్రెస్ ప్రవేశ పెట్టినా ఆరు గ్యారెంటీల పథకాలతో తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని తెలిపారు.
ALSO READ : కేసీఆర్‌కు మరో షాక్.. కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే?
మా ఫోకస్ విద్య, వైద్యం..
గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఐటీడీఏ(ITDA) సమావేశాలు నిర్వహించకుండా వాటి ప్రధాన ఉద్దేశాలను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు భట్టి విక్రమార్క. 2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఐటీడీఏ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందని అన్నారు. గిరిజన కుటుంబాలకు మేలు జరిగే విధంగా పాలకమండలి సమావేశంలో సభ్యులు సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. విద్య, వైద్యం, ఆశ్రమం, ఉపాధి కి బాటలు వేసే విధంగా ఐటీడీఏ ప్రణాళికలు ఉండాలని అన్నారు.
ఐటీడీఏ పరిధిలో గిరిజన జీవన స్థితిగతులు మెరుగుపడాలి అంటే విద్య అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని.. ఆ దిశగా అధికారుల ప్రణాళికలు ఉండాలని తెలిపారు. రెసిడెన్షియల్, ఆశ్రమ, ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. పదవ తరగతి ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు ఉన్నత చదువులు వెళ్లడానికి కావలసిన సహకారం, అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
DO WATCH: