Gruha Jyothi Scheme: గృహ జ్యోతి పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. అర్హులైన సరే గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందని వారి కోసం మరోసారి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ క్రమంలో అర్హులైన వారి దగ్గర నుంచి మరోసారి దరఖాస్తులు స్వీకరించి.. వారికి ఈ పథకం అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్.. ఆరు గ్యారెంటీల పథకాలను పొందేందుకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించారు.
దరఖాస్తు చేసుకున్న బిల్లు..
ఆరు గ్యారెంటీల్లో ఒక పథకమైన గృహాజ్యోతి పథకం ద్వారా అర్హులైన వారికి 200 యూనిట్ల వరకు కరెంట్ బిల్లు లేకుండా ఉచిత విద్యుత్ ను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. అయితే.. ప్రజాపాలనలో ఈ పథకం కొరకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన కొందరికి ఈ పథకం అమలు కావడం లేదని.. జీరో బిల్లులు కొట్టడం లేదని ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందాయి. దీనిపై గతంలో బీఆర్ఎస్ కూడా అనేక విమర్శలు చేసింది.
అర్హులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పి.. కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని.. అర్హులకు కూడా కరెంట్ బిల్లులు కొడుతున్నారని ప్రభుత్వం గట్టిగానే విమర్శలు చేసింది. ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు, ప్రతిపక్షాలు విమర్శల పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క.. ఈ పథకం అందని అర్హుల కోసం మరోసారి వారి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. అర్హులందరికీ ఉచిత విద్యుత్ అందిస్తామని అన్నారు.
ఇలా దరఖాస్తు చేసుకోండి..
గతంలో ప్రజాపాలన కార్యక్రమంలో ఎలా అయితే దరఖాస్తు చేసుకున్నారో అదే విధంగా ఇప్పుడు కూడా అలానే చేసుకోవాలి. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ పొందాలని అనుకుంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కరెంట్ కనెక్షన్ యూనిక్ సర్వీస్ నెంబర్ ను ఇచ్చిన దరఖాస్తు ఫామ్ లో నింపాలి. ఇటీవల ఇంటివద్దకే వచ్చి దరఖాస్తు తీసుకున్న.. ఈసారి మాత్రం అలంటి సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించడం లేదు. మీరు గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉంటే.. ఎంపీడీఓ ఆఫీస్ లో దరఖాస్తు ఇవ్వాలి. అలాగే హైదరాబాద్ నగరంలో ఉన్నవారికి దరఖాస్తులు చేసుకోడానికి ప్రభుత్వం 26 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇలా మీరు గృహ జ్యోతి పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.