తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేరును అధిష్టానం ప్రకటించడంపై సీనియర్లు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం ప్రకటన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy), భట్టి సీరియస్‌గా వెళ్లిపోవడంతో నెక్ట్స్ ఏంటన్నది కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. మీడియా ప్రశ్నలకు భట్టి, ఉత్తమ్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.
ఇది కూడా చూడండి: Big Breaking: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి.. 7న ప్రమాణస్వీకారం
మీరు హ్యాపీనా అని మీడియా వారిని ప్రశ్నించింది. మీరు అసంతృప్తిగా ఉన్నారా? అని కూడా రిపోర్టర్లు అడిగారు. అయితే.. ఏ ప్రశ్నకూ సమాధానం ఇవ్వలేదు. దీంతో వీరిద్దరూ అధిష్టానం నిర్ణయంతో ఏకీభవించి సహకరిస్తారా? లేదంటే ఇంకేమైనా నిర్ణయం తీసుకుంటారా? అన్న అంశంపై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే.. ఉత్తమ్, భట్టి హైదరాబాద్ కు బయలుదేరారు.