BDL Recruitment: డిగ్రీ పాసయ్యారా? అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థ BDLలో ఉద్యోగం పొందండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా? అయితే మీకో శుభవార్త అందించింది భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL).పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. By BalaMurali Krishna 21 Aug 2023 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి BDL Recruitment 2023: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా? అయితే మీకో శుభవార్త. పలు ఉద్యోగాల భర్తీకి భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 45 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియను నేటి నుంచి ప్రారంభించింది. సెప్టెంబర్ 20వ తేదీ వరకు దరఖాస్తులు పెట్టుకునేందుకు సమయం ఇచ్చింది. bdl-india.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఫైనాన్స్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీని పూర్తి చేయనుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. పార్ట్-1లో సంబంధిత సబ్జెక్ట్/టాపిక్‌పై 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. జనరల్ ఆప్టిట్యూడ్‌పై 50 ప్రశ్నలు అడగనున్నారు. రాతపరీక్ష ఈ ఏడాది డిసెంబర్ లేదా 2024 జనవరిలో జరగనుంది. ఓసీ, బీసీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ.500గా ఉంది. ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మాత్రం ఫీజు మినహాయింపు ఇచ్చారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు వివిధ పోస్టులకు వేరు వేరుగా ఉంది. యావరేజ్‌గా 27 నుంచి 32 సంవత్సరాల లోపు వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఉద్యోగాలకు ఎంపికైన మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు రూ.40,000- రూ.1,40,000, వెల్ఫేర్ ఆఫీసర్, జేఎం పోస్టులకు రూ.30,000–రూ.1,20,000 నెలకు వేతనంగా చెల్లిస్తారు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ సందర్శించవచ్చు. మొత్తం పోస్టులు: 45 మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎలక్ట్రానిక్స్): 15 పోస్టులు మేనేజ్‌మెంట్ ట్రైనీ (మెకానికల్): 12 పోస్టులు మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్): 04 పోస్టులు మేనేజ్‌మెంట్ ట్రైనీ (కంప్యూటర్ సైన్స్): 01 పోస్టు మేనేజ్‌మెంట్ ట్రైనీ (సైబర్ సెక్యూరిటీ): 02 పోస్టులు మేనేజ్‌మెంట్ ట్రైనీ (కెమికల్): 02 పోస్టులు మేనేజ్‌మెంట్ ట్రైనీ (సివిల్): 02 పోస్టులు మేనేజ్‌మెంట్ ట్రైనీ (బిజినెస్ డీఈవీ.): 01 పోస్టు మేనేజ్‌మెంట్ ట్రైనీ(ఆప్టిక్స్): 01 పోస్టు మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఫైనాన్స్): 02 పోస్టులు వెల్ఫేర్ ఆఫీసర్: 02 పోస్టులు జేఎం(పబ్లిక్ రిలేషన్స్): 01 పోస్టు బీడీఎల్ యూనిట్/ కార్యాలయాలు.. ఇబ్రహీంపట్నం (రంగా రెడ్డి జిల్లా), కార్పొరేట్ ఆఫీస్ (గచ్చిబౌలి), కంచన్‌బాగ్ యూనిట్ (హైదరాబాద్), భానూర్ యూనిట్ (సంగారెడ్డి జిల్లా), విశాఖపట్నం యూనిట్ (ఏపీ), అమరావతి (మహారాష్ట్ర), లియాసిన్ ఆఫీస్ (న్యూ ఢిల్లీ) కార్యాలయాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. Notification PDF Also Read: డిగ్రీ అర్హతతో రూ. 1,77,500 శాలరీ.. ఛాన్స్ మిస్ చేసుకోవద్దు..అప్లై చేసుకోండి! #bdl-recruitment-2023 #bdl-recruitment-2023-apply-online #bharat-dynamics-limited-recruitment-2023 #bharat-dynamics-limited-recruitment-apply-online #bdl-recruitment-notification-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి