National Investigation Agency Recruitment 2023: 26/11 ముంబై అటాక్స్ తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)ని కేంద్ర ప్రభుత్వం స్థాపించింది. ఉగ్రవాద నిరోధక చట్టాన్ని అమలు చేసే సంస్థగా NIA ఉద్భవించింది. అప్పటి నుంచి NIAకి మాదకద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా, సైబర్ కేసులు, ఉగ్రవాదం, కిడ్నాప్‌తో పాటు మరిన్నింటికి సంబంధించిన కేసులను NIA పరిష్కరిస్తోంది. ఉగ్రవాదంపై దేశ పోరాటంలో కేంద్ర ఏజెన్సీగా గుర్తింపు తెచ్చుకున్న NIA.. ఇప్పుడు జాబ్స్ని ఆఫర్ చేస్తోంది. ఏజెన్సీ సబ్-ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్లు, ఇన్స్పెక్టర్లతో సహా మరికొన్ని దరఖాస్తులను కోరుతోంది. మొత్తం 97 ఖాళీలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
ఇవి తప్పనిసరి:
NIAలో చేరాలనుకునే వారు తప్పనిసరిగా కొన్ని అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అభ్యర్థులు 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా డిగ్రీని కలిగి ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ఏటా నిర్వహించే స్టాఫ్ సెలక్షన్ కమీషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ (SSC CGL)లో పాల్గొనవలసి ఉంటుంది. ఈ పరీక్ష నాలుగు దశల్లో ఉంటుంది: ప్రాథమిక పరీక్ష(preliminary exam), మెయిన్స్ పరీక్ష(mains exam), వివరణాత్మక పరీక్ష(descriptive test), నైపుణ్య పరీక్ష(skill test), తర్వాత వైద్య పరీక్షతో ఎగ్జామ్ ప్రిక్రియ ముగుస్తుంది.
అదిరే శాలరీ:
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రోల్‌కు ఎంపికైన అభ్యర్థులు పే మ్యాట్రిక్స్ లెవల్-10 కింద సంవత్సరానికి రూ. 56,000 నుంచి రూ. 1,77,500 వరకు శాలరీ ఉంటుంది.
డిగ్రీ అర్హతతో రూ. 1,77,500 శాలరీ.. ఛాన్స్ మిస్ చేసుకోవద్దు..అప్లై చేసుకోండి!
సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 10లోపు NIA అధికారిక వెబ్సైట్ https://www.nia.gov.in/ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మొత్తం 97పోస్టులకు ఫిల్ చేయనుంది NIA. వీటిలో కొన్ని జాబ్స్‌కి పే మ్యాట్రిక్స్ లెవల్-10 కింద సంవత్సరానికి రూ.56,000 నుంచి రూ.1,77,500 వరకు శాలరీని పొందవచ్చు!
Translate this News: