Bhagavanth Kesari: ‘చిచ్చా’ వచ్చేసిండు.. దుమ్మురేపుతున్న బాలయ్య ‘భగవంత్ కేసరి’ ట్రైలర్..

ఎప్పుడెప్పుడా అని ఎదుచూస్తున్న నందమూరి అభిమానులకు, సినీ ప్రియులకు మాంచి కిక్ ఇచ్చారు బాలయ్య. ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ వచ్చేసింది. ఒక్కో డైలాగ్‌ను ఒక్కో మిస్సైల్‌గా ఉన్న ఈ సినిమాలో బాలయ్య సరికొత్త లుక్‌లో కనిపించి కెవ్వు కేక పెట్టించారు.

New Update
Bhagavanth Kesari: ‘చిచ్చా’ వచ్చేసిండు.. దుమ్మురేపుతున్న బాలయ్య ‘భగవంత్ కేసరి’ ట్రైలర్..

Bhagavanth Kesari Trailer: ఎప్పుడెప్పుడా అని ఎదుచూస్తున్న నందమూరి(Nandamuri Balakrishna) అభిమానులకు, సినీ ప్రియులకు మాంచి కిక్ ఇచ్చారు బాలయ్య. ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ వచ్చేసింది. ఒక్కో డైలాగ్‌ను ఒక్కో మిస్సైల్‌గా ఉన్న ఈ సినిమాలో బాలయ్య సరికొత్త లుక్‌లో కనిపించి కెవ్వు కేక పెట్టించారు. బాలయ్య మాస్ డైలాగ్స్.. విలన్ క్లాస్ లుక్.. సినిమా నెక్ట్స్ లెవల్‌లో ఉండబోతుందని హింట్ ఇస్తోంది ట్రైలర్. బాలయ్య ఏ సినిమా తీసుకున్నా ఆయన వాడే ఆయుధం చాలా విభిన్నంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ సినిమాలోనూ అలాంటి ఆకర్షణీయమైన ఆయుధాన్ని బాలయ్య వినిగించడం ట్రైలర్‌లో చూడొచ్చు. వరంగల్ వేదికగా చిత్ర బృందం విడుదల చేసిన ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ ప్రస్తుతం దుమ్మురేపుతోంది.

బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనిల్‌ రావిపూడి రూపొందించిన ఈ భగవంత్ కేసరి సినిమాలో కథనాయికగా కాజల్ నటిస్తోంది. శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు ముందు రిలీజ్ చేసిన ఈ ట్రైలర్.. సినిమాపై అభిమానుల అంచనాలను మరింత పెంచేసింది. ముఖ్యంగా బాలయ్య డైలాగ్స్ ట్రైలర్‌లోనే ఇలా ఉంటే.. సినిమాలో ఇంకెన్ని ఉంటాయోనని ఇంట్రస్టింగ్‌గా ఎదురు చూస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్. మరెందుకు ఆలస్యం.. భగవంత్ కేసరి ట్రైలర్‌ను చూసేయండి.

భగవంత్ కేసరి ట్రైలర్..

Also Read:

Srisailam: శ్రీశైలంలో చిరుత పులి సంచారం.. భయాందోళనలో భక్తులు..

India vs Australia World Cup 2023: ఆరంభం అదుర్స్.. తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం..

Advertisment
తాజా కథనాలు