Bhadrachalam: భద్రాచలం కాలువలో హెడ్‌ కానిస్టేబుల్ శ్రీదేవి..అసలేం జరిగింది?

భద్రాచలంలో విషాదం చోటుచేసుకుంది. విధులు నిర్వహిస్తూ హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవి గోదావరి కరకట్టను ఆనుకుని ఉన్న కాలువలో పడి గల్లంతయ్యారు. ఆమెను కాపాడేందుకు NDRF సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. అయితే, అప్పటికే శ్రీదేవి మృతి చెందినట్లు తెలుస్తోంది.

New Update
Bhadrachalam:  భద్రాచలం కాలువలో హెడ్‌ కానిస్టేబుల్ శ్రీదేవి..అసలేం జరిగింది?

కొత్తగూడెం వన్‌టౌన్ పీఎస్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు శ్రీదేవి. అయితే, మంత్రి కేటీఆర్ భద్రాచలం పర్యటన నేపధ్యంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవి అక్కడ విధులు నిర్వహించాలని పై అధికారులు ఆదేశించారు. దీంతో కానిస్టేబుల్ శ్రీదేవి ఈ ఉదయం భద్రచలం చేరుకున్నారు. అయితే మంత్రి కేటీఆర్ పర్యటన రద్దు అయింది. భారీ వర్షం కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో భద్రాచలం పర్యటన రద్దు చేసుకున్నారు మంత్రి కేటీఆర్. దీంతో కానిస్టేబుల్స్ అందరూ తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే, హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవి సడన్ గా తిరిగి బయలుదేరే సమయంలో ఉన్నట్టుండి గోదావరి కరకట్టను ఆనుకుని ఉన్న కాలువలో జారీ పడ్డారు. వెంటనే అప్రమత్తమైన తోటి కానిస్టేబుల్స్  NDRF సిబ్బందికి సమాచారం అందించారు. దాదాపు 50 నిమిషాల పాటు హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమించారు. కానీ, ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరికి గోదావరి స్లూయిజ్ వద్ద హెడ్ కానిస్టేబుల్  శ్రీదేవి మృతదేహం లభ్యమయింది.

అంతకు ముందు వరకు అందరితో సరదగా  కలిసి విధులు నిర్వహించిన హెడ్ కానిస్టేబుల్ ..సడెన్ గా ప్రాణాలతో లేకపోవడంతో విషాదం నెలకొంది. హెడ్ కానిస్టేబుల్ భర్త కూడా పోలీస్ డిపార్ట్ మెంట్ లోనే విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ వినీత్ ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్ ఫ్యామిలీకి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పోస్ట్ మార్టం నిమిత్తం శ్రీదేవి మృతదేహంను ఆసుపత్రికి తరలించారు.

Also Read: అడ్డంగా బుక్కైన తహసీలద్దార్.. ఎటు చూసినా నోట్ల కట్టలే..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు