Curd: వేసవిలో ఇలా తోడేస్తే పెరుగు అస్సలు పుల్లగా మారదు

సాధారణంగా పెరుగును తోడు వేసేప్పుడు మనం తరచుగా కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. దాని వల్ల పెరుగు త్వరగా పుల్లగా మారుతుంది. పెరుగు పుల్లగా మారకుండా నిరోధించడానికి ఒక స్మార్ట్ ట్రిక్ ఉంది. దీనిపై పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

Health Tips: మండే ఎండల్లో మీ శరీరాన్ని చల్లగా ఉంచే ఫుడ్స్ ఇవే.!
New Update

Curd Tips : ఎండా కాలం(Summer) లో పెరుగును ఎక్కువగా తీసుకుంటారు. ఇది శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా జీర్ణక్రియ(Digestion) ను మెరుగుపరుస్తుంది. అయితే ఎండాకాలంలో పెరుగు ఎక్కువగా పుల్లగా మారుతుంది. తోడు వేసేప్పుడు కొన్ని చిట్కాలు పాటించడం వల్ల పెరుగు పుల్లగా మారకుండా చూసుకోవచ్చు. పెరుగు కోసం ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

పెరుగు పుల్లగా మారకుండా ఎలా ఉంచాలి?

  • సాధారణంగా పెరుగు(Curd) ను తోడు వేసేప్పుడు మనం తరచుగా కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. దాని వల్ల పెరుగు త్వరగా పుల్లగా మారుతుంది. పెరుగు పుల్లగా మారకుండా నిరోధించడానికి ఒక స్మార్ట్ ట్రిక్ ఉంది. పాలలో పెరుగు తోడు వేసేముందు దాన్ని బాగా చిలికిన తర్వాత వేయాలి. అంతేకాకుండా పాలలో తోడు వేసేప్పుడు పొయ్యిపై మంటను ఆపిన తర్వాతే వేయాలి. తోడు వేసిన తర్వాత కూడా పాలను బాగా కలియబెట్టాలని నిపుణులు అంటున్నారు.

పులుపు తగ్గించే మరో మార్గం:

  • ఇంట్లో తయారు చేసిన లేదా మార్కెట్‌లో కొనుగోలు చేసిన పెరుగులో పులుపును తగ్గించడానికి మరొక మార్గం ఉంది. వడకట్టి పెరుగు పైభాగంలో, చుట్టూ ఏర్పడిన నీటిని తీసేయడం వల్ల పులుపు తగ్గుతుంది.ఇలా చేయడం వల్ల పెరుగులో పాల ఘనపదార్థం పెరిగి చిక్కగా మారుతుంది. గ్రీక్ యోగర్ట్ డిప్ అయిన లాబ్నెహ్‌ను తయారు చేయడానికి ఈ ప్రక్రియను ఉపయోగిస్తారు. పెరుగును కొనుగోలు చేసినా లేదా తయారు చేసినా పెరుగు నుంచి పాలవిరుగుడు ప్రోటీన్‌ను వడకట్టడం వల్ల దాని పుల్లని రుచి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పాలు బాగా రెండుమూడు సార్లు మరింగించిన తర్వాత తోడు వేస్తే పెరుగు చక్కగా వస్తుందని అంటున్నారు. అలాగే తోడు వేసే పెరుగు కూడా పుల్లగా లేకుండా చూసుకుంటే మంచిదని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: భర్యాభర్తలు ఆఫీసు, ఇంటిని ఎలా బ్యాలెన్స్‌ చేయాలి?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

#home-tips #curd
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe