Smart TV: 32 అంగుళాల స్మార్ట్ టీవీ రూ7,199కే.. ఛాన్స్ మిస్‌ చేసుకోవద్దు!

ఆన్‌లైన్‌ మార్కెట్‌లో తక్కువ ధరకే అదిరిపోయే స్మార్ట్‌ టీవీలు భారీ డిస్కౌంట్లకు అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితాలో MI, Samsung, Kodak , LG లాంటి బ్రాండెడ్ ఎంపికలు ఉన్నాయి. వీటి ధర, ఫిచర్లపై మరిన్ని వివరాలు కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.

Smart TV: 32 అంగుళాల స్మార్ట్ టీవీ రూ7,199కే.. ఛాన్స్ మిస్‌ చేసుకోవద్దు!
New Update

Smart TVs at Low Price: కొత్తగా టీవీని కొనుగోలు చేయాలని చూస్తున్నారా? రానున్నది సమ్మర్ సీజన్‌.. పిల్లలు ఇంట్లోనే ఉంటారు.. అందులోనూ నైట్ ఐపీఎల్‌.. ఎలక్షన్ సీజన్‌ కావడంతో న్యూస్‌ ఛానెల్స్ చూసే వారి సంఖ్య కూడా కాస్త ఎక్కువే ఉంటుంది. అయితే పాత టీవీలోనే ఇంకా ఈ వినోదాన్ని అస్వాదించడం ఎందుకు? ఆన్‌లైన్‌ మార్కెట్‌లో బంపర్‌ డిస్కౌంట్లతో టీవీలు అందుబాటులో ఉన్నాయి. చీప్‌ అండ్‌ బెస్ట్ క్యాటగిరిలో 32 అంగుళాల స్మార్ట్ టీవీ బెటర్‌. ఎందుకంటే వీటిలో అనేక ఫీచర్లు ఉంటాయి. ఈ టీవీల ద్వారా మీరు ఉత్తమ వినోదాన్ని ఆస్వాదించవచ్చు. గొప్ప ఫీచర్లతో కూడిన స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటే మీ కోసమే కొన్ని టీవీలను లిస్ట్ అవుట్ చేశాం. వాటిపై ఓ లుక్కేయండి.

MI 80 cm (32 అంగుళాలు) HD రెడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ LED TV:
32 అంగుళాల స్క్రీన్ పరిమాణంలో వస్తున్న ఈ MI స్మార్ట్ టీవీ చాలా అద్భుతంగా ఉంది . ఈ టీవీలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ హై డెఫినిషన్ వీడియో క్వాలిటీని సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీలో ప్లే స్టోర్ కూడా ఉంది. దీన్ని నుంచి మీరు అనేక ఆన్‌లైన్ అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్‌ యాప్‌లో వీడియో స్ట్రీమింగ్ కూడా చేయవచ్చు. ఈ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ చాలా స్లిమ్ డిజైన్‌లో వస్తుంది.

కోడాక్ 80 సెం.మీ (32 అంగుళాలు) 9XPRO సిరీస్ HD రెడీ సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ LED TV:
ఈ స్మార్ట్ టీవీ సరికొత్త ఫీచర్లతో అమర్చబడింది. ఈ స్మార్ట్ టీవీ స్క్రీన్ సైజు 32 అంగుళాలు. ఇది డాల్బీ డిజిటల్ ప్లస్ సౌండ్ సపోర్ట్‌తో వస్తుంది. కనెక్టివిటీ కోసం, ఇది 3 HDMI, 2 USB పోర్ట్‌లను కూడా కలిగి ఉంది. మీరు ఈ టీవీలో అనేక ఆన్‌లైన్ OTT ప్లాట్‌ఫారమ్‌లను కూడా ఆస్వాదించవచ్చు.

Samsung 80 cm (32 inches) HD రెడీ స్మార్ట్ LED TV:
ఇది టాప్ బ్రాండ్ స్మార్ట్ టీవీ. ఈ Samsung Smart TV HD రిజల్యూషన్‌తో 32-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది గ్లోసీ బ్లాక్ కలర్, స్లిమ్ డిజైన్‌లో వస్తుంది. ఇది HDR సపోర్ట్‌ను కలిగి ఉంది. మెరుగైన విజువల్స్‌ను అందిస్తుంది. దీని శక్తివంతమైన స్పీకర్ చాలా బాగుంది. మీరు ఈ టీవీని వ్యక్తిగత కంప్యూటర్‌గా కూడా ఉపయోగించవచ్చు. గేమింగ్ కన్సోల్‌ని దీనికి కనెక్ట్ చేయవచ్చు.

Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. అయిదుగురు దుర్మరణం..

#smart-tv
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe