Best Oil for Cooking: మనం ఆరోగ్యంగా ఉండాలంటే వంటనూనెను ఎంపిక చేసుకునేటప్పుడు కొన్ని విషయాలను జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. వంట నూనె(Cooking Oil) ఎంపిక చాలా ముఖ్యం. ఎందుకంటే మార్కెట్‌లో రకరకాల నూనెలు ఉంటాయి. అవి వేర్వేరు కొవ్వు పదార్థాలను కలిగి ఉంటాయి. కొన్ని నూనెలు ఆరోగ్యానికి మేలు చేస్తే.. మరికొన్ని హాని తలపెడతాయి. అందుకే సరైన వంట నూనెను ఎంచుకోవడం ముఖ్యం. తద్వారా మీ ఆరోగ్యంతో పాటు.. మీ ఇంటిల్లిపాది ఆరోగ్యం బాగుంటుంది.
వంట నూనెను ఎంచుకునేటప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మీరు ఎంచుకున్న నూనె ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉండాలి. నూనెలో ఉండే కొవ్వు ఆమ్లాల (Fatty Acid) పరిమాణం, నాణ్యత చాలా ముఖ్యం. నూనెలో ఒమేగా -3, ఒమేగా -6 వంటి అసంతృప్త కొవ్వు ఆమ్లాలు అధిక మొత్తంలో ఉండాలి. ఎందుకంటే ఇవి గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. శుద్ధి చేసిన నూనెలకు దూరంగా ఉండటమే ఉత్తమం. ఎందుకంటే వాటిలో ఆరోగ్యానికి హాని కలిగించే ట్రాన్స్ ఫ్యాట్ అధికంగా ఉంటుంది. ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, కనోలా ఆయిల్, మస్టర్డ్ ఆయిల్ వాడడానికి ఉత్తమమైన వంట నూనెలు.
ఇదికూడా చదవండి: Rohit Sharma: రోహిత్ శర్మకు బిగ్ షాక్ ఇచ్చిన పోలీసులు.. అసలేం జరిగిందంటే..
ఆలివ్ ఆయిల్ (Olive oil):
మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఆలివ్ ఆయిల్‌లో ఉంటాయి. ఇవి గుండె, మెదడుకు మేలు చేస్తాయి.
ఆల్మండ్ ఆయిల్ (Almond Oil):
ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ బాదం నూనెలో ఉంటాయి. ఇవి గుండె, మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
ఆవ నూనె (Mustard oil):
మస్టర్డ్ ఆయిల్.. ఆవ గింజల నుండి దీనిని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. భారతీయ వంటకాలలో ఒక సాధారణంగా ఉపయోగిస్తుంటారు. ఇది ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మం, జుట్టు సమస్యలను కూడా తగ్గిస్తుంది.
ఇదికూడా చదవండి: విడాకులు తీసుకున్న కూతురికి ఘనంగా స్వాగతం తెలిపిన తండ్రి.. వీడియో వైరల్..