Best Bikes: కొత్త బైక్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? ఎలాంటి బైక్ కొనాలి.. ఏ బైక్ ఎక్కువ మైలేజీ ఇస్తుంది.. ఏ బైక్ ధర తక్కువగా ఉంది.. ఏ బైక్స్ ఎక్కువగా అమ్ముడు పోయాయి.. వంటి వివరాల కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారా? ఇక మీకు ఆ శ్రమ అవసరం లేదు. అద్భుతమై, తక్కువ ధర, అధిక మైలేజీ ఇచ్చే బైక్స్ వివరాలను మీకోసం అందిస్తున్నాం. హీరో మోటోకార్ప్ నుంచి.. బజాజ్ ఆటో వరకు ఈ సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడుపోయిన 5 బైక్‌ల గురించి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. పండుగ సీజన్‌లోన కాదు.. ఏడాది పొడవునా.. ఈ 5 బైక్‌లు భారీగా అమ్ముడుపోయయాయి. ఒక్కో మోడల్ ధర, దాని మైలేజీ, పవర్ వివరాలు మీకోసం..
హీరో స్ప్లెండర్..
హీరో మోటోకార్ప్ నుంచి బెస్ట్ సెల్లింగ్, పాపులర్ బైక్ హీరో స్ప్లెండర్. దీని ధర ఎక్స్ షోరూమ్‌లో రూ. 75,141 నుండి మొదలై రూ. 77,986 వరకు ఉంటుంది. మైలేజీ పరంగా ఈ బైక్ ఒక లీటర్‌లో 60 కిలోమీటర్ల వరకు వస్తుందని కంపెనీ చెబుతోంది.
హోండా షైన్..
బెస్ట్ సెల్లింగ్ బైక్‌ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తే.. హోండా షైన్ 125 సిసి వేరియంట్‌ను కొనుగోలు చేయొచ్చు. దీని ధర రూ. 79800 (ఎక్స్-షోరూమ్) ఉంది. మైలేజీ పరంగా చూసుకుంటే ఈ బైక్ ఒక లీటర్‌కి 55 కిలోమీటర్లు ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
బజాజ్ పల్సర్..
ఈ సంవత్సరం అత్యధిక డిమాండ్ ఉన్న బైక్ బజాజ్ కంపెనీకి చెందిన పల్సర్ 125. ఈ బైక్ ధర రూ. 89,984 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. దీని మైలేజీ 60 వరకు ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
హీరో HF డీలక్స్..
హీరో మోటోకార్ప్ నుంచి తక్కువ ధర కలిగిన మరొక బైక్ హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్. 2023లో ఈ బైక్‌కు ఫుల్ డిమాండ్ ఉంది. ఈ బైక్ ధర రూ. 59,998 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. మైలేజీ పరంగా ఒక లీటర్ పెట్రోల్‌కు రూ. 60 కిలోమీటర్లు నడుస్తుందని కంపెనీ చెబుతోంది.
TVS రైడర్..
TVS మోటార్ బ్రాండ్‌కు చెందిన ఈ బైక్‌ను ఈ సంవత్సరం వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేశారు. ఈ బైక్ ధర రూ 95,219 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. మైలేజీ విషయానికి వస్తే.. ఈ బైక్ ఒక లీటర్ పెట్రోల్‌లో 67 కిలోమీటర్ల వరకు నడుస్తుందని పేర్కొంది.
Also Read: