Hair Tips : ఆహారపు అలవాట్లు(Food Habits), జీవన శైలి(Life Style) విధానాలు, అశ్రద్ద జుట్టు రాలడానికి(Hair Fall) ముఖ్య కారణాలు. ఈ మధ్య కాలం చాలా మందికి ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. దీని కోసం ఎన్నో రకాల హెయిర్ ట్రీట్మెంట్, ప్రొడక్ట్స్ వాడిన లాభం లేకుండా పోతుంది. అందుకే ఈ సమస్యకు చెక్ పెట్టడానికి మంచి ఔషద గుణాలు కలిగిన కొన్ని హోం రెమిడీస్ ట్రై చేయండి. అద్భుతమైన ఫలితం ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి..
గ్రీన్ టీ
జుట్టును చల్లార్చిన గ్రీన్ టీ(Green Tea) కొంత సమయం ఉంచడం జుట్టు ఆరోగ్యం మంచి ప్రభావం చూపుతుంది. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావం స్కాల్ప ను ఆరోగ్యంగా ఉంచుతూ.. జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. అలాగే జుట్టు మూలాలను కూడా బలంగా చేస్తుంది.
మెంతులు
మెంతులు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగ్గా చేయడంలో అద్భుతంగా పని చేస్తాయి. రాత్రంతా మెంతులను నానబెట్టి.. వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసిన తర్వాత.. ఒక గంట పాటు ఉంచి.. క్లీన్ చేయాలి. ఇది తలలో రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది.
రోజ్మెరీ ఆయిల్
రోజ్మెరీ ఆయిల్(Rosemary Oil) జుట్టు పెరుగుదలకు బాగా సహాయడుతుంది. ఈ ఆయిల్ తలకు పట్టించి బాగా మసాజ్ చేయడం ద్వారా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
ఎగ్ మాస్క్
గుడ్డులో కాస్త ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి.. ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. ఒక అరగంట లేదా గంట తర్వాత శుభ్రంగా కడిగేయాలి. ఎగ్ జుట్టుకు పుష్కలమైన పోషకాలను అందించి దృఢంగా చేస్తుంది.
ఆనియన్ జ్యూస్
జుట్టుకు ఆనియన్ జ్యూస్ అప్లై చేయడం ద్వారా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే దీనిలోని సల్ఫర్ కంటెంట్ కొల్లజెన్ ఉత్పత్తిని పెంచి.. జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. వారంలో ఒక రెండు సార్లు అప్లై చేసిన సరిపోతుంది.
Also Read : Strawberries : కీళ్ల నొప్పులు, మధుమేహ సమస్య వేదిస్తుందా.. అయితే ఈ పండు తినండి