Hair health: ఈ హెయిర్ టిప్స్ పాటించండి.. మీ జుట్టును చూసి ఎవరైనా ఫ్లాట్ అవ్వకపోతే అడగండి..!

ప్రతి ఒక్కరి జుట్టు ప్రత్యేకంగా ఉంటుంది. హెయిర్‌కి మసాజ్‌ చేయడం, వెడల్పు ఎక్కువగా ఉన్న దువ్వెన వాడడం ముఖ్యం. ఒత్తిడిని తగ్గించే పనులు చేయండి. సహజసిద్దమైన హెయిర్‌ ఆయిల్‌ని యూజ్ చేయండి. సల్ఫేట్ లేని షాంపూని ఉపయోగించండి. బాగా వేడిగా ఉన్న వాటర్‌ని కూడా తలపై పోసుకోవద్దు.

New Update
Hair health: ఈ హెయిర్ టిప్స్ పాటించండి.. మీ జుట్టును చూసి ఎవరైనా ఫ్లాట్ అవ్వకపోతే అడగండి..!

కొంతమందికి హెయిరే అసెట్‌.. మరికొంతమందికి అదే సమస్య. కొందరికి జుట్టు(Hair) అసలు పెరగదు.. మరికొందరికి ఎక్కువగా పెరుగుతుంది. దీనికి చాలా కారణాలుంటాయి. అయితే ప్రేమకు జుట్టుకు ఎలాంటి సంబంధం లేదు. జుట్టును చూసి లవ్‌ చేయడం లాంటివి ఎవరైనా చెబితే పట్టించుకోకండి. ఎందుకంటే ప్రేమ అన్నది మనసుకు సంబంధించిన అంశం. అయితే అందంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. జుట్టుని స్టైలిష్‌గా(Stylish), అట్రాక్టివ్‌గా మార్చుకోవాలని చాలా మంది కోరుకుంటారు. ఇందులో ఏ మాత్రం తప్పు లేదు. అందుకే ఈ టిప్స్‌ మీకు అందిస్తున్నాం.

publive-image ప్రతీకాత్మక చిత్రం

వాటర్‌: మీ జుట్టు, స్కాల్ప్ హైడ్రేట్‌గా ఉంచడానికి పుష్కలంగా నీరు తాగండి. ఎక్కువగా వాటర్‌ తాగడం కేవలం జుట్టుకే కాదు మొత్తం ఆరోగ్యానికి మంచిది.

షాంపూ: సల్ఫేట్ లేని షాంపూని ఉపయోగించండి. ఎక్కువగా జుట్టును కడగడం మానుకోండి. ఎంత వాష్‌ చేయాలో అంతే చేయండి.

కండీషనింగ్: మీ జుట్టును మృదువుగా ఉంచడానికి మంచి కండీషనర్ ఉపయోగించండి.

వేడి వద్దు: హీట్ ప్రొటెక్టెంట్‌ని ఉపయోగించండి. వేడి ఎక్కువగా ఉండే వాటిని జుట్టు దగ్గరకు తీసుకు రావద్దు. బాగా వేడిగా ఉన్న వాటర్‌ని కూడా తలపై పోసుకోవద్దు.

publive-image ప్రతీకాత్మక చిత్రం

రెగ్యులర్‌గా ట్రిమ్ చేయండి: జుట్టు చివర్లు చీలిపోకుండా ఉండటానికి ప్రతి 6-8 వారాలకు ఒకసారి మీ జుట్టును కట్ చేయండి.

టైట్ హెయిర్‌స్టైల్‌ వద్దు: టైట్ పోనీటెయిల్స్ లేదా బ్రెయిడ్‌లు జుట్టు బ్రెక్‌ అవ్వడానికి కారణం కావచ్చు. సో అవి అవైడ్ చేయండి.

సిల్క్ పిల్లోకేస్: సిల్క్ పిల్లోకేస్‌పై పడుకోవడం వల్ల మీ జుట్టుపై ఫ్రిక్షన్ తగ్గుతుంది. ఇది హెయిర్‌ ఫ్రిజ్‌ను నివారిస్తుంది.

సహజ నూనెలు: హెయిర్‌ షైన్ అవ్వాలి అనుకుంటే మీ జుట్టుకు కొబ్బరి లేదా ఆర్గాన్ ఆయిల్ లాంటి సహజ నూనెలను పూయండి.

ఒత్తిడిని తగ్గించండి: అధిక ఒత్తిడి స్థాయిలు మీ జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఒత్తిడిని తగ్గించే పద్ధతులను పాటించండి. ఏ విషయంలోనూ ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దు.

publive-image ప్రతీకాత్మక చిత్రం

కెమికల్స్‌ వద్దు: కలరింగ్, స్ట్రెయిటెనింగ్ వంటి కెమికల్‌ థింగ్స్‌ వినియోగాన్ని తగ్గించండి.

యూవీ: UV బారి నుంచి కాపాడే ప్రొడక్ట్స్‌ని ఉపయోగించండి. సూర్యుడి యూవీ కిరణాల నుంచి మీ జుట్టును రక్షించుకోవచ్చు.

దువ్వెన: మీ జుట్టు దెబ్బతినకుండా ఉండేందుకు వెడల్పు ఎక్కువగా ఉండే దువ్వెనని ఉపయోగించండి.

మసాజ్: మీ తలకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

ALSO READ: బ్లాక్‌ హెడ్స్‌కి చెక్‌ పెట్టే చిట్కాలు.. ఇవి ఫాలో అవ్వండి చాలు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు