మీ చర్మం అందంగా మెరిసిపోవాలంటే ఇంట్లోనే ఈ ప్యాక్ లు చేసేయండి! చలికాలంలో ముఖం మెరిసిపోవాలంటే ఇంట్లోనే పేస్ ప్యాక్ లు తయారు చేసుకోని వేసుకోవచ్చు. ఇలా చేస్తే చర్మం మెరిసిపోవడమే కాకుండా.. కాంతి వంతంగానూ ఉంటుంది. అంతేకాకుండా నకిలీ ప్రొడెక్ట్ ల నుంచి చర్మాన్ని రక్షించుకోవచ్చు. By Bhavana 16 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి చలికాలం మొదలైపోయింది. బయటకు వెళ్తే ముఖం అంతా పొడిబారిపోయినట్లు ఉండడమే కాకుండా..తెల్లతెల్లగా కూడా తయారవుతుంది. అసలే పెళ్లిళ్ల సీజన్ కూడా..ఇలాంటి సమయంలో ముఖం మరింత మెరిసిపోవాలంటే పార్లర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న కొన్ని రకాల ఐటమ్స్ తోనే ప్యాక్స్ చేసుకోవచ్చు. చక్కగా సహజ సిద్దమైన పదార్థాలతో ప్యాక్ లు తయారు చేసుకోవడం వల్ల చర్మం పై ఉండే మురికి పోవడంతో పాటు చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాంతివంతంగా మెరిసిపోతుంది కూడా. పసుపు, శెనగపిండి కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం పై ఉన్న మలినాలు తొలగిపోయి..ముఖం పై పేరుకున్న జిడ్డున్నంతటిని కూడా తొలగిస్తుంది. ఇలా వారానికి రెండు మూడుసార్లు చేస్తే చర్మం మెరిసిపోతుంది. చందనంతో : గంధం చాలా కూలింగ్ ఏజెంట్ మాత్రమే కాదు..యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కూడా కలిగి ఉంటుంది. అందుకే చర్మం అందాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ఇలా వారంలో నాలుగు సార్లు చేయడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. చర్మంపై ఉన్న నల్లటి మచ్చలు పోతాయి. వేప, తులసి ఆకుల పేస్ట్ ను ఓ టీ స్పూన్ పెరుగు, పసుపు పొడి కలిపి ముఖానికి రాసుకుంటే...చర్మం సహజంగా మెరుస్తుంది. బియ్యంపిండి ప్యాక్: బియ్యం పిండిలో టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ మిక్స్ చేసి, పేస్ట్ లా చేసి ముఖానికి ,మెడకు రాసుకుని 15 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల ముఖం మెరిసిపోతుంది. పెరుగు, ముల్తానీ మట్టి..దీనిని రెగ్యులర్ గా వేసుకోవడం వల్ల ముఖం పై ఉండే మొటిమలు తగ్గుతాయి. పెరుగులో యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ ఇన్ఫ్లమెటరీ గుణాలు కలిగి ఉంటుంది. కాఫీపొడి, తేనె కలిపి తరువాత ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇలా చేసిన తరువాత నీటితో ముఖాన్ని చల్లని నీటితో కడిగేయాలి. ఇది నాచురల్ మాయిశ్చరైజర్ గా కూడా ఉపయోగపడుతుంది. Also read: సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయండంటూ కేరళ సీఎంకి కేంద్ర మంత్రి లేఖ! #winter #facepacks #home-made మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి