Health Tips: చిన్నగా కనిపించే పుట్టగొడుగుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శీతాకాలంలో పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పుట్టగొడుగుల్లో విటమిన్ ఎ,బి,సితోపాటు ప్రొటీన్, జింక్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇమ్యూనిటీని పెంచడంతోపాటు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
చలికాలం(winter)లో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కాలానుగుణంగా ఆహారాన్ని తినాలి. వేడి వేడి ఆహారంతోపాటు కొన్ని పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఈ కాలంలో ఇమ్యూనిటీ(Immunity) చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వ్యాధులు అటాక్ చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ కాలంలో పుట్టగొడుగులు (Mushrooms)విరిగా లభిస్తాయి. చిన్నగా కనిపించే ఈ పుట్టగొడుగుల్లో పోషకాలు(Nutrients in mushrooms) పుష్కలంగా ఉంటాయి. మధుమేహం, కొలెస్ట్రాల్, రక్తపోటు సమస్యలను నియంత్రించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే ఇటువంటి లక్షణాలు పుట్టగొడుగులలో ఉన్నాయి. శీతాకాలంలో పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
పుట్టగొడుగుల్లో పుష్కలంగా పోషకాలు:
ప్రొటీన్, విటమిన్ ఎ, బి, సి డి, సెలీనియం, జింక్, ఫైబర్, అమినో యాసిడ్స్ వంటి పోషకాలు పుట్టగొడుగుల్లో పుష్కలంగా లభిస్తాయి. అంతే కాకుండా యాంటీ ఆక్సిడెంట్, యాంటీ క్యాన్సర్, యాంటీమైక్రోబయల్, యాంటీ డయాబెటిక్, యాంటీవైరల్ గుణాలు ఇందులో ఉన్నాయి. ఇది మిమ్మల్ని అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది.
పుట్టగొడుగులను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
రోగనిరోధక శక్తిని పెంచుతుంది :
ఈ సీజన్‌లో, ప్రజల రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా మారుతుంది. కాబట్టి దానిని పెంచడానికి, మీరు తప్పనిసరిగా మీ ఆహారంలో పుట్టగొడుగులను చేర్చుకోవాలి. విటమిన్ ఎ, బి, సి కాకుండా, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుట్టగొడుగులలో ఉన్నాయి. ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది:
పీచు, పొటాషియం, విటమిన్ సి పుట్టగొడుగుల్లో ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది కాకుండా, బీట్ గ్లూటెన్ అనే మూలకం ఇందులో ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. దీని వల్ల మీ గుండె ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది.
ఎముకలను దృఢంగా చేస్తుంది:
కీళ్లలో నొప్పి ఎక్కువగా ఉంటే. లేదా మీ ఎముకలు చాలా పగుళ్లు ఉంటే మీరు తప్పనిసరిగా పుట్టగొడుగులను తీసుకోవాలి. క్యాల్షియం, విటమిన్ డి పుట్టగొడుగులలో పుష్కలంగా లభిస్తాయి. ఇది మీ ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది.
డయాబెటిస్‌లో మేలు :
ఒక పరిశోధన ప్రకారం, మీ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడే కొన్ని పుట్టగొడుగులలో యాంటీడయాబెటిక్ లక్షణాలు ఉన్నాయని వెల్లడించింది. డయాబెటిస్ రోగులు పుట్టగొడుగులను ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
బరువు తగ్గించడంలో:
పీచుతో పాటు, పాలిసాకరైడ్స్, పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి అనేక బయోయాక్టివ్ మూలకాలు పుట్టగొడుగులలో కనిపిస్తాయి. ఇది బరువు తగ్గడంతో పాటు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
Also read: ఉదయాన్నే గొంతు పట్టేసిందా..ఈ హోం రెమెడీస్ తో చెక్ పెట్టండి..!!