Azaan-Bhajan: 'ఆజాన్ కోసం నీ భజన ఆపు..' దుకాణదారుడిపై దాడి! బెంగళూరులో ఆజాన్ సందర్భంగా బిగ్గరగా ఓ మతానికి చెందిన పాటను ప్లే చేసినందుకు ఓ దుకాణదారుడిని కొందరు యువకులు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిద్దన్న లేఅవుట్ ప్రాంతంలో దుకాణదారుడిపై దాడి జరిగింది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి. By Trinath 18 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి దేవుడు కోసం తన్నుకోవడం కొత్తేమీ కాదు.. అదో ముర్ఖత్వం. ఏ దేవుడు కూడా తన కోసం తన్నుకోమని చెప్పడని అన్నీ మతాల వారు చెప్పుకుంటారు. కానీ కొంతమంది మాత్రం భౌతికదాడులకు కూడా వెనుకాడరు. మా మాతానిదే పైచేయి అని చాటడం కోసం కొట్టడానికి కూడా సిద్ధపడతారు. చాలా సార్లు ఇవి మత ఘర్షణలకు దారి తీస్తాయి. ఆజాన్ అన్నది ముస్లింలకు ఎంతో ముఖ్యం.. అదే సయయంలో మిగిలిన మతాల వారికి కూడా ప్రేయర్ చేసుకునే హక్కు ఈ దేశం కల్పించింది. మత ప్రార్థనల విషయంలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి. ఇవి తెలియని కొందరు చేయి పారేసుకుంటారు. బెంగళూరులో జరిగిన ఓ ఘటన చూస్తే ఈ విషయం మరోసారి ప్రూవ్ అవుతుంది. ఆజాన్ సమయంలో భజన చేస్తున్నాడన్న ఆరోపణతో బెంగళూరు దుకాణదారుని కొందరు వ్యక్తులు కొట్టడం రచ్చకు దారితీసింది. అసలేం జరిగింది? కర్ణాటకలోని బెంగళూరులో హిందూ దుకాణదారుడిని కొట్టిన ఎపిసోడ్ వెలుగులోకి వచ్చింది. ముఖేశ్ అనే ఓ దుకాణదారుడు హనుమాన్ చాలీసా ప్లే చేస్తుండగా కొందరు ప్లే చేయవద్దని చెప్పారు. ఆజాన్ ప్లే అవుతుండగా భజన చేయకూడదని వారించినట్టుగా ముఖేశ్ చెబుతున్నాడు. ముందుగా ముఖేశ్‌పై ఓ గ్రూప్ వాదనకు దిగింది. ఈ గొడవ చినికి చినికి గాలి వానలా పెద్దదైంది. తర్వాత ఒకరిపై ఒకరు దాడి చేసుకునేలా పెరిగింది. బెంగళూరులోని నగరత్‌పేట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సిద్దన్న లేఅవుట్ దగ్గర ముఖేష్ మొబైల్ షాప్ వద్ద ఈ తన్నులాట జరగగా.. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు ఈ కేసులో ఆరుగురుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అందులో ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ కేసులో మత కోణాన్ని పోలీసులు తోసిపుచ్చారు. #Bengaluru Muslim boys trash shopkeeper for playing loud music during Azaan So Azaan can be loud 5 times a day that's ok? The irony! Hope this Ramzan better sense prevails 🙏🏻 Incident reported near Siddanna Layout, FIR lodged in Halasuru gate police station! pic.twitter.com/MEuoImIJxV — Nabila Jamal (@nabilajamal_) March 18, 2024 ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ముఖేష్ తన షాపులో మ్యూజిక్ సిస్టమ్‌లో హనుమాన్ చాలీసా వింటున్నాట్టుగా తెలుస్తోంది. ఇంతలో దాదాపు అరడజను మంది యువకులు అతని దుకాణానికి చేరుకున్నారు. ఆజాన్ సమయం చెబుతూ హనుమాన్ చాలీసాను ఆపమని ముఖేష్‌ను కోరినట్టుగా వీడియో చూస్తే అర్థమవుతుంది. దీన్ని ముఖేష్ ఖండించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం వమొదలైంది. గొడవ పెద్దది కావడంతో ముఖేష్‌ను కొట్టారు. గొడవ దుకాణం నుంచి మెల్లిగా రోడ్డుపైకి వచ్చింది. ఈ ఫైటింగ్‌లో ముఖేష్ బట్టలు కూడా చిరిగిపోయాయి. Also Read: ‘రోహిత్ శర్మ నా కింద…’ పాండ్యా షాకింగ్ కామెంట్స్! #viral-video #bengaluru #hanuman-chalisa #azhaan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి