Bengaluru CEO: కుమారుడిని చంపిన తర్వాత ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. సీఈవో క్రైమ్‌ ఎపిసోడ్‌తో విస్తుపోయే వాస్తవాలు!

నాలుగేళ్ల కన్నకొడుకును చంపేసిన మైండ్‌ఫుల్ AI ల్యాబ్ అనే స్టార్టప్ కంపెనీ వ్యవస్థాపకురాలు, CEO సుచనా సేథ్‌ కేసులో విస్తుపోయే వాస్తవాలు బయటకొస్తున్నాయి. కుమారుడిని చంపేసిన తర్వాత సుచనా మణికట్టు కోసుకోని ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. అయితే ధైర్యం సరిపోక ఆ పని చేయలేదు.

New Update
Bengaluru CEO: కుమారుడిని చంపిన తర్వాత ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. సీఈవో క్రైమ్‌ ఎపిసోడ్‌తో విస్తుపోయే వాస్తవాలు!

నాలుగేళ్ల చిన్నారిని, కన్న కొడుకుని మైండ్‌ఫుల్ AI ల్యాబ్ అనే స్టార్టప్ కంపెనీ వ్యవస్థాపకురాలు, CEO సుచనా సేథ్‌ హత్య చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. జనవరి 6న తన కుమారుడితో కలిసి గోవా(Goa)లోని సోల్ బన్యన్ గ్రాండే హోటల్‌కు వెళ్లిన సుచన... అక్కడ కొడుకును చంపేసి జనవరి 8 హోటల్ నుంచి చెక్ అవుట్ చేశారు. భర్తతో విభేదాల కారణంగా ఆమె ఈ దారుణానికి పాల్పడింది. పోలీసుల సమాచారం ప్రకారం.. సుచనా సేథ్‌ తన భర్తతో-బిడ్డ కలవకుండా నిరోధించేందుకే ఈ దారుణమైన చర్యకు పాల్పడింది. హోటల్‌ సిబ్బందికి అనుమానం రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆమెను పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఆమె కీలక విషయాలు చెప్పింది.

ఆత్మహత్య చేసుకోవాలనుకుంది:
గోవాలోని సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో తన నాలుగేళ్ల కొడుకును హత్య చేసిన బెంగళూరుకు చెందిన సుచనా సేథ్‌ ఎడమ మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ విషయాన్ని ప్రాథమిక విచారణలో పోలీసులకు చెప్పింది. అయితే ఆ తర్వాత సుచనా సేథ్ మనసు మార్చుకుని రూ. 30,000 ఖరీదు చేసే టూరిస్ట్ క్యాబ్‌లో కుమారుడి మృతదేహాన్ని బ్యాగ్‌లో నింపుకుని బెంగళూరు వెళ్లిపోపోయిందని పోలీసులు తెలిపారు. 39 ఏళ్ల వ్యాపారవేత్తను కర్ణాటకలోని చిత్రదుర్గలో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అపార్ట్‌మెంట్‌లోని సిబ్బంది ఆమె గదిలో ఎరుపు మరకలను గుర్తించి స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు సేథ్ క్యాబ్ డ్రైవర్‌ను సంప్రదించి చివరికి CEOని అరెస్టు చేశారు. ఆమె లగేజీని తనిఖీ చేయగా చిన్నారి మృతదేహం లభ్యమైంది.

పోలీసులకు సమాచారం:
సుచనా సేథ్ వద్ద పెద్ద ట్రాలీ బ్యాగ్ ఉందని, కానీ ఆమె తీసుకువచ్చిన కుమారుడు చెక్‌ అవుట్‌ సమయంలో మహిళా సీఈవోతో లేరని హోటల్ సిబ్బంది గమనించారు. ఇది మాత్రమే కాదు, సుచనా సేథ్ గోవా నుంచి బెంగుళూరుకు వెళ్లడం కోసం ఆమె హోటల్ సిబ్బందిని టాక్సీ బుక్ చేయమని కోరారు. గోవా నుంచి బెంగుళూరుకు టాక్సీలో వెళ్లే బదులు ఫ్లైట్ ఎక్కితే బాగుంటుందని సిబ్బంది చెప్పారు. ఆ తర్వాత కూడా ఆమె విమానంలో కాకుండా టాక్సీలో వెళ్లాలని, ఎవరికైనా ఫోన్ చేయాలని పట్టుబట్టిందని హోటల్ సిబ్బంది పోలీసులు చెప్పారు. ట్యాక్సీ బుకైన తర్వాత అందులో బెంగళూరుకు బయలుదేరింది. అయితే హౌస్ కీపింగ్ చేసేవారు తమ గదిలో శుభ్రం చేస్తుండగా రక్తపు మరకలను గమనించడంతో హోటల్ సిబ్బందికి అనుమానాలు బలపడ్డాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

కవర్‌ చేసే ప్రయత్నం:
హోటల్‌ సిబ్బంది సమాచారంతో వెంటనే బరిలోకి దిగిన పోలీసులు సుచనతో పాటు ట్యాక్సీ డ్రైవర్‌ను కాంటాక్ట్‌ అయ్యారు. డ్రైవర్‌ను పిలిచి మాట్లాడు. అటు సూచనా సేథ్‌తో కుమారుడు ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు. తన స్నేహితుడితో కొడుకు ఉన్నట్టు చెప్పుకొచ్చింది. పోలీసులు అడ్రెస్‌ అడగగా.. ఒక చిరునామా చెప్పింది. పోలీసులు ఆ అడ్రెస్‌కు చేరుకోగా అది నకిలీదని తేలింది. ఈ సారి పోలీసులు మళ్లీ ఇద్దరిని పిలిచారు. ట్యాక్సీ డ్రైవర్‌తో ఈసారి హిందీలోనో, ఇంగ్లీషులోనో కాకుండా కొంకణిలో మాట్లాడడంతో సూచనా సేథ్‌కి ఏమీ అర్థం కాలేదు. బెంగుళూరుకు తూర్పున 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్రదుర్గ పోలీస్ స్టేషన్‌కు వాహనాన్ని తీసుకెళ్లాలని పోలీసులు టాక్సీ డ్రైవర్‌ను కోరారు. అతనూ అలాగే డ్రైవ్ చేశాడు. ఆపై పోలీసులు కారులో ఉంచిన బ్యాగ్‌ని తెరిచి చూడగా సుచన కుమారుడి మృతదేహం కనిపించింది.

Also Read: మా దేశానికి టూరిస్టులను పంపించండి ప్లీజ్..చైనాను వేడుకుంటున్న మాల్దీవులు!

WATCH:

Advertisment
తాజా కథనాలు