ఆజాన్ సమయంలో హనుమాన్ చాలీసా వింటున్నాడని దుకాణుదారుడిని కొట్టిన సంఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీసులు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో మొత్తం ఆరుగురి మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయం మీద ఈరోజు బెంగళూరులో భారీ నిరసనలు చేపట్టింది బీజేపీ. ఈ నిరసనలతో సిటీలో గందరగోళం చెలరేగడంతో పాటూ గొడవలు జరిగే సూచనలు కూడా కనిపించడంతో...ఈ ప్రొటెస్ట్‌ను లీడ్ చేస్తున్న బీజేపీ నేత తేజస్వి సూర్యను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగింది?
కర్ణాటకలోని బెంగళూరులో హిందూ దుకాణదారుడిని కొట్టిన ఎపిసోడ్ వెలుగులోకి వచ్చింది. ముఖేశ్ అనే ఓ దుకాణదారుడు హనుమాన్ చాలీసా ప్లే చేస్తుండగా కొందరు వద్దని వారించారు. ఆజాన్ ప్లే అవుతుండగా భజన చేయకూడదని వారించినట్టుగా ముఖేశ్ చెబుతున్నాడు. దీంతో ముందుగా ముఖేశ్‌పై ఓ గ్రూప్ వాదనకు దిగింది. ఈ గొడవ చినికి చినికి గాలి వానలా పెద్దదైంది. తర్వాత ఒకరిపై ఒకరు దాడి చేసుకునేలా చేసింది. బెంగళూరులోని నగరత్‌పేట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సిద్దన్న లేఅవుట్ దగ్గర ముఖేష్ మొబైల్ షాప్ వద్ద ఈ తన్నులాట జరగగా.. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు ఈ కేసులో ఆరుగురుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అందులో ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ కేసులో మత కోణాన్ని పోలీసులు తోసిపుచ్చారు.
ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ముఖేష్ తన షాపులో మ్యూజిక్ సిస్టమ్‌లో హనుమాన్ చాలీసా వింటున్నట్టుగా తెలుస్తోంది. ఇంతలో దాదాపు అరడజను మంది యువకులు అతని దుకాణానికి చేరుకున్నారు. ఆజాన్ సమయం చెబుతూ హనుమాన్ చాలీసాను ఆపమని ముఖేష్‌ను కోరినట్టుగా వీడియో చూస్తే అర్థమవుతుంది. దీన్ని ముఖేష్ ఖండించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. గొడవ పెద్దది కావడంతో ముఖేష్‌ను కొట్టారు. గొడవ దుకాణం నుంచి మెల్లిగా రోడ్డుపైకి వచ్చింది. ఈ ఫైటింగ్‌లో ముఖేష్ బట్టలు కూడా చిరిగిపోయాయి.
Also Read:Movies: మహేష్ చాలా అందగాడు..అతన్ని జపాన్ తీసుకువస్తా-రాజమౌళి