Bengal : బీజేపీ (BJP) ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ (Amit Malviya) ఓ స్త్రీలోలుడని.. బెంగాల్ కి వచ్చినప్పుడల్లా పలువురు మహిళలతో శారీరక సంబంధం (Sexual Relation) పెట్టుకునే వారని బెంగాల్ కు చెందిన శంతన్ సిన్హా (Shantanu Sinha) అనే నేత సంచలన ఆరోపణలు చేశారు. ఆయన తన శారీరక అవసరాల కోసం కేవలం హోటళ్లను మాత్రమే కాకుండా బీజేపీ కార్యాలయాలను కూడా ఉపయోగించుకునే వారని శంతను ఆరోపించారు.
శంతన్ తనని తాను ఆర్‌ఎస్‌ఎస్ అధికార ప్రతినిథిగా చెప్పుకున్నారు. కేవలం ‘‘మహిళలతో గడపటం కోసం మాలవీయ స్టార్ హోటళ్లనే కాకుండా బెంగాల్‌లోని బీజేపీ కార్యాలయాలను కూడా ఉపయోగించుకున్నారు’’ అని శంతన్ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు. ‘‘బెంగాల్‌లోని బీజేపీ నేతలు తమ పదవులను కాపాడుకోవడం కోసం అమిత్ మాలవీయ లాంటి నాయకులకు ఇలా అమ్మాయిలను సరఫరా చేస్తూనే ఉంటారా’’ అని ప్రశ్నించారు. అయితే, ఈ ఆరోపణలను మాలవీయ తీవ్రంగా ఖండించారు.
శంతన్ ఆరోపణలు అబద్ధమని, అత్యంత తీవ్రమైనవిగా పేర్కొన్నారు. దీంతో శంతన్ పై రూ.10కోట్లకు పరువు నష్టం దావా వేశారు. మూడు రోజుల్లోగా ఫేస్‌బుక్ పోస్టును వెంటనే తొలగించాలని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అమిత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు లీగల్ నోటీసులు కూడా పంపించారు. ఈ గడువు మంగళవారంతో ముగియనుంది. మరోవైపు, శంతను ఆరెస్సెస్ ప్రతినిధిగా ఎప్పుడూ లేరని ఆ సంస్థ వర్గాలు వివరించాయి.