Reading Benefits: చిన్నగా ఉన్నప్పుడు కచ్చితంగా స్కూల్‌కి వెళ్లి చదవుతాం, ఆ తర్వాత కాలేజీకి వెళ్లి చదువుకుంటాం. కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత చదవడం ఆపేస్తారు. సంపాదనలో పడ్డారంటే చదువంటే (reading) తెలియదు. కానీ ప్రతిరోజు కనీసం ఒక అరగంట పాటు ఏదైనా చదివితే చాలా ప్రయోజనాలు (Benefits) ఉంటాయని న్యూరో సైన్స్ నిపుణులు (Neuro science experts) అంటున్నారు.
ఇది కూడా చదవండి: షుగర్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఇక ఇన్సులిన్ అక్కర్లేదు
రోజూ చదవడం వల్ల ఆలోచన శక్తి పెరుగుతుందని, ఏకాగ్రతతో పాటు జ్ఞాపకశక్తి (memory) అధికం అవుతాయని, మెదడు చురుకుగా పనిచేస్తుందని చెబుతున్నారు. అందుకే రోజూ కనీసం అరగంట అయినా ఏదైనా చదవాలని సూచిస్తున్నారు. నాలెడ్జ్ పెంచుకోవడానికి కాకపోయినా మెదడును చురుగ్గా ఉంచుకునేందుకు పత్రికల్లో వచ్చే వార్తలు, పుస్తకాలు, కామిక్స్, కథలు అయినా సరే చదవాలని చెబుతున్నారు. దీని వల్ల మన మెదడు యాక్టివ్ (Brain active)గా పనిచేస్తుందని అంటున్నారు.
ఇది కూడా చదవండి: చనిపోయిన వారి మాటలు కొందరికి ఎందుకు వినిపిస్తాయి?
రోజు ఇలా చదివితే జ్ఞాపకశక్తితో పాటు ఏకాగ్రత, ఆలోచన విధానం మారుతుందని, అంతేకాకుండా వృద్ధాప్యంలో అల్జీమర్స్ కూడా దరి చేరవని, ఇంకా ఎన్నో లాభాలున్నాయని నిపుణులు అంటున్నారు. అలాగే సృజనాత్మకత బాగా పెరగాలంటే ప్రతిరోజూ పజిల్స్ పూరించాలని, నాలెడ్జ్ (Knowledge)పెంచుకోవాలంటే పాఠ్యాంశాలతో పాటు పత్రికలను కూడా చదవాలని చెబుతున్నారు. అంతేకాకుండా భాషపై పట్టు పెరగాలన్నా ఆ భాషకు చెందిన పుస్తకాలు, పత్రికలు చదువుతూ ఉండాలని ఇలా రోజూ చేస్తే మెదడుతో పాటు విజ్ఞానం కూడా పెరుగుతుందని శాస్త్రవేత్తలు (Scientists) అంటున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఈ ఐదు ఆహార పదార్థాలు పక్కన పెడితే.. మధుమేహం, స్థూలకాయం పరార్..!!