Gourd Juice: పొట్లకాయ రసం ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు

ఆరోగ్యంగా ఉండాలంటే పుచ్చకాయ, దోసకాయ, మామిడి, నారింజ, పొట్లకాయ, పానీయాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని నిపుణులు అంటున్నారు. పొట్లకాయ రసంలో కేలరీలు చాలా తక్కువ కాబట్టి బరువు తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. రక్తప్రసరణలో ఇబ్బంది లేకుండా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

New Update
Gourd Juice: పొట్లకాయ రసం ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు

Gourd Juice: ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలంటే సహజమైన ఆహార పదార్థాలు, పానీయాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. పుచ్చకాయ, దోసకాయ, మామిడి, నారింజ, పొట్లకాయ ఇలా అన్నింటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. మన శరీరం కూడా నాల్గవ వంతు నీటితోనే నిర్మితమై ఉంటుంది. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల మనకు ఎక్కువ నీటిశాతం అందుతుంది.

బరువును తగ్గిస్తుంది:

  • పొట్లకాయ రసంలో కేలరీలు చాలా తక్కువ కాబట్టి బరువు తగ్గించడంలో (Weight Loss) కీలకపాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా శరీరంలోని కొవ్వు పదార్థాలను కరిగించి బరువు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

గుండెకు చాలా మంచిది:

  • పొట్లకాయ రసాన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మన శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గుతాయి. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది . గుండె సంబంధిత సమస్యలను నివారిస్తుంది. రక్తప్రసరణలో ఎలాంటి ఇబ్బంది లేకుండా మెదడు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.

జీర్ణశక్తి అధికం:

  • పొట్లకాయలో చాలా నీటి కంటెంట్ ఉన్నందున మన జీర్ణవ్యవస్థ (Digestive System) ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీనిలోని ఔషధ గుణాలు కడుపులోని ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి. అంతేకాకుండా ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తుంది.

జుట్టు, చర్మ ఆరోగ్యానికి మేలు:

  • పొట్లకాయ సహజంగా మన శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. కాబట్టి మన జుట్టు బాగా పెరుగుతుంది (Hair Growth). అంతేకాకుండా చర్మం అందంగా కనిపిస్తుంది.

మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది:

  • పొట్లకాయ రసం (Gourd Juice) తాగడం వల్ల మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. తెలివితేటలు, చురుకుదనాన్ని అందించడంలో సహాయపడుతుంది.

శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది:

  • మన శరీరంలో రక్తప్రసరణ బాగా జరిగితే ఏ అవయవానికి ఎలాంటి సమస్య ఏర్పడదు. ఈ రసంలో ఎక్కువ మొత్తంలో నీరు ఉంటుంది. దాని వల్ల మన శరీరానికి ఎక్కువ నీరు అందుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, రక్తం గడ్డకట్టే అవకాశం ఎక్కడా ఉండదు.

ఇది కూడా చదవండి: జిమ్‌లో చేరే ముందు ఈ టెస్ట్‌లు చేయించుకుంటే మంచిది

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఈ సూప్‌‌లతో పాలను మించిన పోషకాలు.. ఉక్కులాంటి ఎముకలు మీ సొంతం

Advertisment
తాజా కథనాలు