eating ice cream: ఐస్ క్రీమ్ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దలవారకు ఇష్టపడని వారు ఉండరు. ఎన్నో ఫ్లేవర్లతో ఎంతో ఆకర్షణీయంగా మరియు టేస్టీగా ఉండే ఈ ఐస్ క్రీమ్ అంటే ఇష్టంలేని వారు ఎవరు ఉంటారు చెప్పండి. ముఖ్యంగా పిల్లలు అయితే బయటకు వెళ్లినప్పుడు ఐస్ క్రీమ్ కావాలని మారాం చేస్తారు. కానీ.. ఈ ఐస్ క్రీమ్ తినటం వల్ల ఆరోగ్యానికి చేడు చేస్తుందనే భయం ఎక్కువ మందిలో ఉంటుంది. అయితే.. కొన్ని ఐస్ క్రీమ్ తినటం వల్ల చాలా లాభాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు.
ఇది కూడా చదవండి: పాపం..ఆ ఊరిలో అందరూ పెళ్లి కాని ప్రసాదులే
వయసుతో సంబంధం లేకుండా ఇష్టంగా తినే వాటిల్లో ఐస్ క్రీమ్ ఒకటి. అయితే ..ఐస్ క్రీమ్ తినడం వల్ల కేవలం నష్టాలు మాత్రమే ఉంటాయి అందరూ అనుకుంటారు. కానీ దీని వల్ల లాభాలు ఉంటాయని కొందరికి మాత్రం తెలుసు. ఐస్ క్రీమ్ తినడం వల్ల శరీరం చల్ల బడి వేడి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ప్రస్తుతం ఐస్ క్రీమ్స్‌లో వెరైటీ ఫ్లేవర్లతో మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా పోషక విలువలతో కూడిన ఐస్‌క్రీమ్‌లు ప్రస్తుతం అందుబాటులో ఉంటున్నాయి. నిజానికి ఐస్ క్రీమ్ తినడం వల్ల ఎండార్ఫిన్ హార్మోన్లు విడుదలవుతాయని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు ఐస్‌క్రీమ్ తింటే మనస్సుకు చాలా మంచిదని నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఐస్‌క్రీం తింటే శరీరంలో శక్తి వస్తుంది
అయితే.. ఈ ఐస్ క్రీం ప్రతిరోజు తినడం వల్ల శరీరానికి కాల్షియం అందకుండా చేస్తుంది. అలాగే ఎముకలు మరియు దంతాలను కూడా బలపరుస్తుంది. ఐస్‌క్రీం తింటే శరీరంలో శక్తి త్వరగా వస్తుంది. దంతాలు తీసిన తర్వాత ఐస్‌క్రీం తింటే త్వరగా గాయం మానుతుంది. ఈ టైంలో ఐస్ క్రీమ్ తినడం చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. కడుపునిండా అన్నం తిన్నా తరువాత చాలామందికి ఆఖరిలో ఐస్ క్రీమ్ తింటారు. అలాంటి ఐస్ క్రీమ్‌లో రుచితో పాటు కొన్ని పోషక విలువలు ఉన్నాయి. అయితే.. ఐస్ క్రీమ్ పూర్తిగా పోషక ఆహారం అని చెప్పలేము.. కానీ ప్రముఖ పోషకాహార నిపుణులు ఐస్ క్రీమ్‌లో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. ఈ న్యూస్ ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇచ్చాము. మరిన్ని ఆరోగ్య సమస్యలు ఉంటే మంచి డాక్టర్లను సంప్రదిస్తే మంచిది.