Cardamom Soaked Water Benefits: యాలకులు నీటిలో నానబెట్టి తింటే అంతులేని లాభాలు

సంపూర్ణ ఆరోగ్యానికి పరగడుపున తినే ఆహారం మంచి ఫలితం ఇస్తుంది. మార్నింగ్ యాలకుల నీటి తాగితే నోటి దుర్వాసన పోతుంది. చర్మ సమస్యలు ఉంటే ఈ పానీయం చాలా బాగా పనిచేస్తుంది. యాలుకలకు ప్రత్యేకమైన విటమిన్లు, మినరల్స్‌ ఆరోగ్యానికి టన్నుల బెనిఫిట్స్ ఇస్తుంది.

New Update
Cardamom Soaked Water Benefits: యాలకులు నీటిలో నానబెట్టి తింటే అంతులేని లాభాలు

Cardamom Soaked Water Benefits: ప్రస్తుత కాలంలో సంపూర్ణ ఆరోగ్యానికి ముఖ్యమైన ఫుడ్‌ చాలా అవసరం. అంతేకాదు పరగడుపున తినే ఆహారం మన ఆరోగ్యానికి మంచి ఫలితం ఇస్తుంది. ఖాళీ కడుపుతో తిసుకునే డ్రింక్స్ ఆరోగ్యకరమైంది. బెస్ట్ హెల్త్‌కు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ గురించి ఇప్పటికే ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రాత్రి యాలకులను నీటిలో నానబెట్టి ఉదయాన్నే తాగితే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. యాలుకలకు ప్రత్యేకమైన సువాసన, రుచి ఉంటుంది. యాలుకలు సాంప్రదాయ వైద్యంలో శతాబ్దాలుగా ఉపయోగించబడుతున్న ఈ ఆయుర్వేద మూలిక. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, అవసరమైన విటమిన్లు, మినరల్స్‌ ఆరోగ్యానికి టన్నుల బెనిఫిట్స్ ఇస్తుంది.   ఈ సుగంధ ద్రవ్యాన్ని ఉదయం పూట తాగితే ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

శ్వాసకోశ ఆరోగ్యం

*యాలకులు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధులను దూరం చేస్తుంది.
*ఈ వాటర్ గొంతు దురద, పొడి నుంచి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.

నోటి దుర్వాసన నివారణ

*మార్నింగ్ యాలకుల నీటి తాగితే నోటి దుర్వాసన పోతుంది.
*ఈ మూలికలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు నోటి దుర్వాసన, నోటి పరిశుభ్రతను ప్రోత్సహిస్తాయి.

ఆరోగ్యమైన చర్మం

*చర్మ సమస్యలు ఉంటే ఈ పానీయాన్ని చాలా బాగా పనిచేస్తుంది.
*యాలకుల యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఫ్రీ రాడికల్స్ చర్మాన్ని కాపాడుతుంది
*ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మానికి ఈ నీరు బెస్ట్.

బ్లడ్ ప్రెజర్ తగ్గుదల

*అధిక రక్తపోటు, హైపర్‌టెన్షన్‌ ఉంటే ఈ పానీయాన్ని ఉదయపు తాగాలి.
*ఇలాచీ నీరు రక్తపోటు స్థాయిలను అదుపులో ఉంటుంది.

పీరియడ్ పెయిన్ ఉపశమనం

*ఈ నీరు తాగితే స్త్రీలలో పీరియడ్‌ నొప్పి వంటి తగ్గుతాయి.
*హార్మోన్ల అసమతుల్యతలను శాంతపరిచి శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తుంది.
*యాలకుల పానీయం యాంటిస్పాస్మోడిక్ లక్షణాల నొప్పి ఉపశమనం లభిస్తుంది.

జీర్ణక్రియ

*ఖాళీ కడుపుతో ఈ నీరు తాగడం వల్ల జీర్ణ రసాలను ఉత్తేజపరిచి, సరైన జీర్ణక్రియను ప్రోత్సహింది.
*ఈ నీరు తాగితే మలబద్ధకం, ఉబ్బరం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

అమేజింగ్ డిటాక్స్ డ్రింక్

*మార్నింగ్ యాలకుల నీటిని తాగితే శరీరాన్ని లోపల నుంచి డిటాక్సిఫికేషన్ చేస్తుంది.
*శరీరం నుంచి టాక్సిన్స్, అదనపు ద్రవాలను బయటకు పంపుతుంది.
*యాలకుల నీరు పూర్తి ఆరోగ్య శ్రేయస్సును ప్రోత్సహించి, జీవక్రియను మెరుగుపరుస్తుంది.
*బరువు తగ్గాలనుకునే వారికి ఈ పానీయం బెస్ట్‌

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు