Milk: నిద్రకు ముందు పాలు తాగుతున్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..!

రాత్రి పడుకునేటప్పుడు వేడి పాలు తాగడం మంచిది. రాత్రి పడుకునే గంట ముందు పాలు తాగడం వల్ల బాగా నిద్రపోవచ్చు. పాలు అలసట నుంచి ఉపశమనం పొందటానికి, గాఢంగా నిద్రపోవడానికి కూడా సహాయపడుతుంది. పాలలో ఉండే కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును అదుపులో ఉంచుతాయి.

Milk: నిద్రకు ముందు పాలు తాగుతున్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..!
New Update

Milk Benefits: పాలు(Milk) ఆరోగ్యానికి చాలా మంచిది. పాలతోనే మన జీవితం ప్రారంభం అవుతుంది. అక్కడ నుంచి ఎదుగుతుంది. టీనేజ్‌ వరకు కూడా పాలు తాగడం ఎంతో ముఖ్యం. అయితే వయసు పెరిగే కొద్దీ పాలను లిమిట్‌గా తాగుతుంటారు. జీర్ణ సమస్యల వల్ల తగ్గిస్తారు. అయితే లిమిట్‌గా పాలను తాగవచ్చు. దాని వల్ల ఏం కాదు. కానీ.. ఏ సమయంలో పాలు తాగలన్నది కూడా తెలుసుకోవాలి. మనం చాలా మందిని చూస్తుంటాం.. రాత్రి(Night) పడుకునే ముందు పాలు తాగి పడుకుంటారు. కాగా.. ఇలా తాగడం మంచిదేనా..? రాత్రిపూట పాల తాగితే ఏం అవుతుంది..?

రాత్రిపూట పాలు తాగవచ్చా?

ప్రతిరోజూ పాలు తాగడం వల్ల శరీరానికి మంచిదని మనకు తెలుసు. పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి, ఎముకలను బలోపేతం చేస్తాయి. పాలు అలసట నుంచి ఉపశమనం పొందటానికి, గాఢంగా నిద్రపోవడానికి కూడా సహాయపడుతుంది. పాలలోని పొటాషియం రక్తపోటును సమతుల్యం చేస్తుంది. అలాగే ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండటం వల్ల త్వరగా ఆకలి ఉండదు. మీరు రాత్రిపూట ఆకలితో ఉంటే పాలును తాగవచ్చు. పాలలో ఉండే కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఇది అధిక రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటే నిద్ర కూడా బాగా పడుతుంది. పాలలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది స్లీప్ హార్మోన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది.

నిద్రకు ముందు పాలు ఎప్పుడు తాగాలి?

రాత్రి పడుకునే గంట ముందు పాలు తాగడం వల్ల బాగా నిద్రపోవచ్చు. పాలలో, కేసైన్ ట్రిప్టిప్టిక్ హైడ్రోలైజ్ పెప్టైడ్ల మిశ్రమం ఉంటుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడంలో ఈ మిశ్రమం ఉపయోగపడుతుంది. ఇది మంచి నిద్ర పొందడానికి కూడా హెల్ప్‌ చేస్తుంది. రానున్న రోజుల్లో నిద్రలేమి సమస్యలకు చికిత్స చేయడానికి వీటిని ఉపయోగించవచ్చు. అమెరికన్ కెమికల్ సొసైటీకి చెందిన జర్నల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో ఈ అధ్యయనం ప్రచురితమైంది.

ఇది కూడా చదవండి:  క్షణాల్లో జిడ్డును వదిలించుకోండిలా.. కిచెన్‌ క్లీనింగ్‌ టిప్స్‌పై ఓ లుక్కేయండి!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#health-benefits #milk #deep-sleep
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe