Lip care: లిప్స్‌పై తేనెను పూయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే.. ఇలా అప్లై చేయండి! నల్లని పెదవులను గులాబీ రంగులోకి, మృదువుగా మార్చే లక్షణాలు తేనెలో పుష్కలంగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. తేనెతో పెదాలు ఉపశమనం పొందవచ్చు. తేనె పెదాలకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి. By Vijaya Nimma 14 May 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Lip care: పెదాలను అందంగా, గులాబీ రంగులో మార్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసేవారకి తేనెతో ఉపశమనం పొందవచ్చు. పెదవులు నల్ల ఉంటే ఇబ్బంది పడేవారు చాలామంది ఉంటారు. దాని కారణంగా కొందరూ ఆందోళన చెందుతారు. నల్ల పెదాలతో ఇబ్బంది పడుతుంటే.. తేనెను ఈ విధంగా ఉపయోగించవచ్చు. పెదవులపై తేనెను పూయడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిసే ఆశ్చర్యపోతారని నిపుణులు అంటున్నారు. నల్లని పెదవులు గులాబీ రంగులోకి , మృదువుగా మార్చే లక్షణాలు తేనెలో పుష్కలంగా ఉన్నాయి. మీ పెదాల నలుపుతో ఇబ్బంది పడుతుంటే.. ఈ హోం రెమెడీని ప్రయత్నించడం ద్వారా పెదాలను పింక్, అందంగా మార్చుకోవచ్చు. తేనె వల్ల కలిగే ప్రయోజనాలు, పెదవుల సంరక్షణ ఎలాంటి ఉపయోగపడుతుందో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. తేనెతో ఉన్న ఔషధ గుణాలు: తేనెలో తినడానికి రుచిగా ఉండటమే కాకుండా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఇది శతాబ్దాలుగా చర్మ సంరక్షణ కోసం ఉపయోగించబడింది. తేనెలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉన్నాయి, ఇది పగిలిన, నల్లని పెదాలకు తేమను అందిస్తుంది. అంతే కాదు, తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇది వాపు మరియు చికాకును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇది కాలిన పెదవులు మరియు గాయాలను త్వరగా తగ్గిస్తుంది. నల్ల పెదవుల చికిత్స: తేనె యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది ఇన్ఫెక్షన్ నుంచి పెదాలను రక్షించడంలో, నయం చేయడంలో సహాయపడుతుంది. హానికరమైన బ్యాక్టీరియాను చంపడంలో కూడా ప్రభావవంతంగా పని చేస్తుంది. పెదవులు నల్లగా లేదా పగుళ్లుగా మారినట్లయితే.. తేనెను ఉపయోగించి పెదాలను స్క్రబ్ చేయవచ్చు. దీనికోసం తేనెలో కొంత చక్కెరను మిక్స్ చేసి తర్వాత పెదాలపై మృదువుగా మసాజ్ చేయాలి. పొడిబారిపోతుంది: పెదవులపై చికాకును తగ్గించడంలో తేనె చాలా సహాయపడుతుంది. పొడిని తొలగించి పెదాలను హైడ్రేట్‌గా ఉంచుతుంది. సహజ ఎంజైమ్‌లు తేనెలో కనిపిస్తాయి. ఇది పెదాలను ప్రకాశవంతంగా చేస్తుంది. పెదాలపై మాయిశ్చరైజర్‌ను నిర్వహించడానికి, చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి తేనె దివ్యౌషధంగా పని చేస్తుంది. తేనెను వాడే విధానం: తేనెను నేరుగా పెదాలపై అప్లై చేస్తే లిప్‌బామ్‌లా పనిచేస్తుంది. ఇది కాకుండా.. వేడి నీటిలో 1 చెంచా తేనె కలిపి ఒక ద్రావణాన్ని తయారు చేసి.. అందులో దూదిని నానబెట్టి పెదవులపై కొన్ని నిమిషాల పాటు ఉంచాలి. నిద్రపోయే ముందు.. పెదవులపై పలుచని తేనెను రాసి.. రాత్రంతా అలాగే ఉంచి, ఉదయం కడిగేయాలి. ఇలా చేయడం వల్ల కొందరికి అలెర్జీ ఉండవచ్చు. ఇలా ఉంటే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: ప్రతిరోజూ ఇంటిని తుడుచుకోవడం వల్ల తుడుపుకర్ర నల్లగా మారిందా? ఈ చిట్కాలు పాటించండి! #lip-care మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి