PM Modi: మోదీ సర్కార్ కీలక ప్రకటన...లబ్దిదారులకు రూ. 5లక్షలు. వెంటనే ఈ విధంగా చేయండి..!!

ఆయుష్మాన్ కార్డు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సర్కార్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లో భాగంగా తీసుకువచ్చింది. ఈ పథకం కింద కార్డు కలిగినవారు ప్రతిఏడాది రూ. 5లక్షల వరకు ఫ్రీ ట్రీట్ మెంట్ తీసుకుంటారు. ఈ స్కీం కింద గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం లభిస్తుంది.

New Update
PM Modi: మోదీకి తగ్గని క్రేజ్..అత్యంత ప్రజాదరణ నేతగా మరోసారి అగ్రస్థానంలో ప్రధాని..!!

కేంద్రంలోని నరేంద్రమోదీ(modi govt) సర్కార్ తీసుకువచ్చిన ఆయుష్మాన్ కార్డు(Ayushman card) గురించి చాలా మందికి తెలియదు. ఈ కార్డు ఉన్నవాళ్లు రూ. 5లక్షల ప్రయోజనం పొందుతారు. దీనికోసం ఈ కార్డును డౌన్ లోడ్ చేసుకోవల్సి ఉంటుంది. ఎలాగో తెలుసుకుందాం. ఈ కార్డును డౌన్ లోడ్ చేసుకునేందుకు మీరు మీకు మొబైల్ నెంబర్ తోపాటు ఆధార్ కార్డు కూడా ఉండాలి. ఆ తర్వాత ఈ కార్డు ద్వా రూ. 5లక్షల ప్రయోజనం పొందవచ్చు. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఆయుష్మాన్ కార్డు ఎందుకు అవసరం:
ఆయుష్మాన్ కార్డును ప్రధానమంత్రి నరేంద్రమోదీ సర్కార్...ఆయుష్మాన్ భారత్ స్కీంలో భాగంగా తీసుకువచ్చింది. ఈ స్కీం ఇప్పుడు జన్ ఆరోగ్య యోజన పేరుతో పిలుస్తున్నారు. ఈ స్కీంతో కార్డు ఉన్నవారు ప్రతి ఏడాది రూ. 5లక్షల వరకు ఫ్రీ మెడికల్ ట్రీట్ మెంట్ తీసుకోవచ్చు. ఈ స్కీం కింద ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో ఫ్రీ వైద్యం లభిస్తుంది. అలాగే ఈ కార్డు కింద చాలా వ్యాధులు నయం చేయించుకునే వీలుంది. పేదవారికి ఫ్రీ మెడికల్ ఫెసిలిటీ అందించడమే ఈ కార్డు ముఖ్య ఉద్దేశ్యం.

ఈ స్కీమ్ కు ఎవరు అర్హులు ?
ఆయుష్మాన్ కార్డు పొందాలంటే 2011 జనాభా లెక్కల ప్రకారం లబ్దిదారులు ఆర్థికంగా పేదవారై..బీపీఎల్ రేఖకు దిగువన ఉన్నవారై ఉండాలి. అలాంటివు ఆన్ లైన్ లో ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం.

ఆయుష్మాన్ కార్డును ఇలా డౌన్ లోడ్ చేసుకోండి:
మీరు ముందుగా అధికారిక వెబ్ సైట్ (https://www.pmjay.gov.in)లోకి వెళ్లాలి. అక్కడ పైన టాప్ లో ఉన్న ఐయామ్ ఎలిజిబుల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత మీరు ఆయుష్మాన్ భారత్ అకౌంట్ తో లింక్ అయి ఉన్న మీ మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయండి. ఒకవేళ లబ్దిదారుల జాబితాలో మీ పేరు లేనట్లయితే..మీ మొబైల్ కు ఓటీపీ వస్తుంది. దాన్ని మీరు అక్కడ నమోదు చేయాలి. తర్వాత మీరు మరో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఆయుష్మాన్ భారత్ కార్డు లేదా పీఎంజేఏవై కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు స్క్రీన్ పై కనిపించే డౌన్ లోడ్ కార్డ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మీకు ఆయుష్మాన్ కార్డు పీడీఎఫ్ ఫార్మాట్ లో డౌన్ లోడ్ అవుతుంది.

మీరు దాన్ని ప్రింట్ తీసుకుని మీ దగ్గర ఉంచుకుంటే మంచిది. మీరు ఆసుపత్రికి వెళ్లినప్పుడల్లా ఈ కార్డును చూపించి ఫ్రీ వైద్యం పొందవచ్చు. ఈ ప్రక్రియలో మీరు ఆయుష్మాన్ కార్డును డౌన్ లోడ్ చేసుకోలేనట్లయితే...మీకు దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లీ తీసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: సీఎం జగన్‌కు షాక్.. మరో ఎమ్మెల్యే రాజీనామా?

Advertisment
Advertisment
తాజా కథనాలు