PM Modi : 'మోదీ హామీ అంటే నెరవేరే హామీ' బెగుసరాయ్‌లో గత ప్రభుత్వాల దుమ్ముదులిపిన ప్రధాని.!

ఎన్నికల ఏడాది సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఔరంగాబాద్‌,బెగుసరాయ్‌లలో పర్యటిస్తున్నారు.బీహార్లో మరోసారి డబుల్ ఇంజన్ ఊపందుకున్నదన్నారు మోదీ. బెగుసరాయ్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని...గత ప్రభుత్వాలపై మండిపడ్డారు. లాలూ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు.

New Update
Delhi High Court : ప్రధాని మోదీకి బిగ్ రిలీఫ్..అనర్హత పిటిషన్‌ను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు

PM Modi :  లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం బీహార్‌లోని ఔరంగాబాద్ లో పర్యటించారు. బెగుసరాయ్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ..లాలూ కుటుంబంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.ఈ బహిరంగ సభలో ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌కు స్వాగతం పలికారు.ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

తమ తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన పార్టీలలో వారసులు ఉన్నత స్థానాలను ఆక్రమించారని ప్రధాని మోదీ అన్నారు. వారికి వారసత్వంగా పార్టీలు వచ్చాయని.. వారితో పాటు వారు చేసిన అవినీతిని కూడా వారసత్వంగా పొందారని ఘాటు విమర్శలు చేశారు. అనంతరం బరౌనీ యూరియా ప్లాంట్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు.

ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత బీహార్‌లో వంశపారంపర్య రాజకీయాలు చిన్నాభిన్నం కావడం ప్రారంభమైందని ప్రధాని మోదీ అన్నారు. వంశపారంపర్య రాజకీయాల్లో ఇది మరో వ్యంగ్యం అంటూ ఎద్దేవా చేశారు. మన తల్లిదండ్రుల నుండి పార్టీని, కుర్చీని వారసత్వంగా పొందుతున్నాము, కానీ మన తల్లిదండ్రుల ప్రభుత్వాల పనిని ఒక్కసారి కూడా ప్రస్తావించే ధైర్యం లేదు. ఇదీ వంశపారంపర్య పార్టీల పరిస్థితి అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

బీహార్‌లో పాతకాలం ఉన్నప్పుడే రాష్ట్రాన్ని అశాంతి, అభద్రత, భయాందోళనల మంటల్లోకి నెట్టేశారని అన్నారు. బీహార్ యువత రాష్ట్రాన్ని వదిలి వలస వెళ్లాల్సి దుస్థితి నెలకొందన్నారు ప్రధాని మోదీ . నేటి యువతలో నైపుణ్యాలను పెంపొందిస్తున్న యుగం ఇది అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పనుల గురించి వివరించారు. బీహార్ హస్తకళలను ప్రోత్సహించేందుకు రూ.200 కోట్లతో నిర్మించనున్న ఏక్తా మాల్‌కు శంకుస్థాపన చేశామన్న ప్రధాని... ఇది కొత్త బీహార్‌కి కొత్త దిశ అన్నారు. ఇది బీహార్ సానుకూల ఆలోచన అని.. బీహార్‌ను మళ్లీ పాత కాలానికి వెళ్లనివ్వబోమని మోదీ ఇస్తున్న హామీ అన్నారు.

ఇది కూడా చదవండి :  అనంత్ అంబానీ కార్ల కలెక్షన్స్…వాటి ధరలు తెలుస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..!

Advertisment
తాజా కథనాలు