Ayodhya: వారధి నిర్మాణానికి గుప్పెడు మట్టిని వెంటేసుకొచ్చినందుకే ఉడత భక్తికి మెచ్చి ప్రేమను పంచిన మర్యాదా పురుషోత్తముడు శ్రీరాముడు. ఇప్పుడు రాం లల్లా ఆలయ నిర్మాణంలో అలాంటి ఘటనే మరొకటి జరిగింది. ఈ బృహత్కార్యంలో అందరినీ భాగస్వాములను చేయాలని పలు సంస్థలు విరాళం చేపట్టిన సంగతి తెలిసిందే. దీనికి ప్రజల నుంచి అంచనాలకు మించి స్పందన లభించింది. ఎవరికి తోచినంత వారు తమ శక్తికి మించి రాముడి గుడి కోసం సమర్పించుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని యాచకులు కూడా రామకార్యంలో భాగస్వాములు కావడం విశేషం.
ఇది కూడా చదవండి: Health Tips: ఈ బిజీ లైఫ్ లో.. ఈ పనులు చేయకపోతే మీ ఆరోగ్యం పాడైనట్లే..!
వచ్చే ఏడాది జనవరి 22న అయోధ్యలో వైభవంగా జరగబోతున్న రాం లల్లా విగ్రహ ప్రతిష్ఠ కోసం యావద్దేశం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ఈ వేడుక కోసం చకాచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. భక్తులు శక్తికి మించి ధన, వస్తు రూపేణా సహకారం అందిస్తున్నారు. యూపీలో కొందరు యాచకులు కూడా దీనికి ముందుకొచ్చారు. ప్రయాగ్‌రాజ్, కాశీ ప్రావిన్స్‌లకు చెందిన కొందరు యాచకులు రామాలయానికి భారీ విరాళం అందించారు.
ఇది కూడా చదవండి: కెరటాల అడుగున మునిగిన ద్వారకనూ దర్శించొచ్చు.. గుజరాత్ ప్రభుత్వ సబ్‌మెరైన్ సేవలు
మందిర నిర్మాణానికి ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తున్న సమర్పణ నిధికి తామూ సహకారం అందిస్తామని 2020 నవంబర్‌లో కాశీకి చెందిన కొందరు యాచకులు సంస్థ కార్యాలయాన్ని సందర్శించారు. క్యాంపెయిన్‌లో తమను భాగస్వాములను చేయాలని కోరారు. సంస్థ ప్రతినిధులు మొదట సంశయించినా వారి విజ్ఞప్తితో విరాళం స్వీకరించేందుకు అంగీకరించారు. 27 జిల్లాలకు చెందిన 300 మందికిపైగా యాచకులు మందిర నిర్మాణం కోసం రూ.4.50 లక్షల భారీ విరాళాన్ని భక్తిశ్రద్ధలతో సమర్పించారు. వీళ్లే కాదు, కష్టజీవులెందరో ఈ దైవకార్యంలో భాగస్వాములవడానికి స్వచ్ఛందంగా ముందుకొస్తుండడం గమనార్హం.