Aeroplane: ల్యాండింగ్‌కి ముందు ఫ్లైట్‌ ఫ్యూయల్‌ గాల్లోకి వృథాగా వదిలేస్తారు.. ఎందుకో తెలుసా?

విమానాల్లో ఉపయోగించే ఫ్యూయల్ చాలా ఖరీదైనది, అలాగే పరిమితంగా దొరుకుతుంది. అలాంటప్పుడు గాల్లో రిలీజ్ చేయడం వృథా కదా అనిపించవచ్చు. కానీ ఈ ఫ్యూయల్ ను ల్యాండింగ్ సమయంలో ఎందుకు వృథాగా వదిలేస్తారో తెలుసా?

New Update
Aeroplane: ల్యాండింగ్‌కి ముందు ఫ్లైట్‌ ఫ్యూయల్‌ గాల్లోకి వృథాగా వదిలేస్తారు.. ఎందుకో తెలుసా?

ఈ రోజుల్లో పరిమిత వనరులు, పెరుగుతున్న ఆయిల్‌ ధరలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఈ సమయంలో విమానాలు ల్యాండ్ అయ్యే ముందు గాలిలోనే ఫ్యూయల్‌ వదిలేస్తాయని (Emptying Aeroplane Fuel) తెలుసుకుని చాలామంది షాక్ అవుతున్నారు. విమానాల్లో ఉపయోగించే ఫ్యూయల్ చాలా ఖరీదైనది, అలాగే పరిమితంగా దొరుకుతుంది. అలాంటప్పుడు గాల్లో రిలీజ్ చేయడం వృథా కదా అనిపించవచ్చు. కానీ ఈ ఫ్యూయల్ జెట్టింగ్ (ఇంధనం ఖాళీ చేయడం) విధానం అనేది చాలా కీలకం. ఇలా చేయడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి.

విమానయాన సంస్థల ప్రకారం, కొన్ని సందర్భాల్లో ఫ్యూయల్ ఎంప్టీ చేయడం వల్ల నష్టం కంటే లాభాలే ఎక్కువగా ఉంటాయి. అయితే ల్యాండింగ్‌కు ముందు ఫ్యూయల్‌ను ఇలా గాల్లో వదిలేయడం అనేది తరచుగా జరిగే విషయం కాదు.ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ప్రతినిధి అలీసన్ డుకెట్ ఒక ఇంటర్వ్యూలో, ప్లేన్‌లోని ఫ్యూయల్ ఖాళీ చేయడం చాలా అరుదుగా జరుగుతుందని చెప్పారు. ఎందుకంటే కొన్ని విమానాలు టేకాఫ్ కంటే ల్యాండ్ అయ్యేటప్పుడు చాలా తేలికగా ఉంటాయి. వీటిని తేలికగా తయారయ్యేలా ఇంజనీర్లు డిజైన్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో, ఈ తేడా ఏకంగా 2,00,000 పౌండ్ల (90,909.1 కిలోలు) కంటే ఎక్కువగా ఉంటుంది.

ఫ్లైట్ భారీ బరువుతో టేకాఫ్ అవ్వడం కష్టమేమో కానీ దిగడం ఈజీయే కదా అని చాలామంది అనుకుంటారు. ల్యాండ్‌ అయ్యే సమయంలో విమానంపై తీవ్రమైన ఒత్తిడి కలుగుతుంది. విమానం భారీ బరువుతో దిగితే అది భూమిని చాలా గట్టిగా, వేగంగా ఢీకొనవచ్చు. విమానానికి నష్టం కలగవచ్చు. సాధారణంగా ఈ సమస్యను ఫ్లైట్ స్వయంగా పరిష్కరించుకుంటుంది. లాంగ్ జర్నీకి టేకాఫ్ అయ్యేటప్పుడు, ఒక పెద్ద విమానయాన సంస్థ పదుల వేల గ్యాలన్ల ఇంధనాన్ని మోసుకెళ్లవచ్చు,దీనివల్ల (గ్యాలన్‌కు సుమారు 6.7 పౌండ్లకు) లక్షలాది పౌండ్ల ఇంధనంతో ఫ్లైట్ బరువుగా మారవచ్చు. అయితే లాంగ్ జర్నీలో విమానం సహజంగా ఇంధనాన్ని దాదాపు పూర్తిగా వినియోగించుకుంటుంది. ఫలితంగా ఇంధనం ఖాళీ అయిపోయి ఫ్లైట్‌ బరువు తగ్గుతుంది. విమాన తయారీదారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని విమానాలను రూపొందిస్తారు, తద్వారా అవి గమ్యస్థానానికి చేరుకున్నప్పుడు సురక్షితంగా దిగడానికి తగినంత తేలికగా మారతాయి.

* ఎప్పుడు ఫ్యూయల్‌ ఖాళీ చేస్తారంటే?

కొన్నిసార్లు, అత్యవసర పరిస్థితుల్లో విమానాన్ని ముందస్తుగా ల్యాండ్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో విమాన ఇంధనం ఖాళీ చేయడం అవసరం అవుతుంది. ఇది చాలా సులభమైన ప్రక్రియ. విమానంలో పైలట్ ఒక స్విచ్‌ను నొక్కడం ద్వారా ఫ్యూయల్ ఎంప్టీ చేయడం ప్రారంభించొచ్చు. ఈ వ్యవస్థలో పంపులు, వాల్వ్‌లు ఉంటాయి, ఇవి విమాన రెక్కలపై ఉన్న నాజిల్స్ నుంచి ఇంధనాన్ని రిలీజ్‌ చేస్తాయి. ఈ వ్యవస్థ ఒక నిమిషానికి వేలాది పౌండ్ల ఇంధనాన్ని బయటకు రిలీజ్ చేయగలదు. బయటకు వచ్చిన ఫ్యూయల్‌ కాంట్రైల్ (విమానం వదిలిన పొగ) లాగా కనిపిస్తుంది. గాల్లోకి ఫ్యూయల్ వదలడం కారణంగా పర్యావరణానికి హాని కలుగుతుంది. విమానయాన సంస్థలకు దీనివల్ల చాలా డబ్బు కూడా వేస్ట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇది ప్రయోజనాలను చేకూర్చుతుంది. అందుకే ఈ ఘటనలు అరుదుగా జరుగుతాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు