Beauty Tips: చేతులు ముడతలు పడ్డాయా? ఈ టిప్స్ పాటించండి, 10 రోజుల్లో తేడా చూడండి..!

చెడు జీవన శైలి కారణంగా ఏర్పడే తొలి లక్షణాల్లో చేతిపై ముడతలు ఒకటి. అందమైన, మృదువైన చేతులు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ, వయసు పెరిగే కొద్ది చేతులపై ముడతలు వస్తుంటాయి. ఈ ముడతలు పోవాలంటే ఈ చిట్కాలు పాటించండి.

New Update
Beauty Tips: చేతులు ముడతలు పడ్డాయా? ఈ టిప్స్ పాటించండి, 10 రోజుల్లో తేడా చూడండి..!

Home Remedies for Rid of Wrinkles of Hands: నేటి బిజీ జీవనశైలిలో ఆరోగ్యాన్ని(Health) పట్టించుకోవడమే ఎక్కువ.. ఇక చేతులకు ముడతలు, మచ్చల గురించి పట్టించుకునేది ఎవరు? అవును, ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ డబ్బు డబ్బు అంటూ పరుగులు తీస్తున్నారు తప్ప తమ ఆరోగ్యంపై ఏమాత్రం శ్రద్ధ వహించడం లేదు. ఫలితంగా చాలా మంది 30 ఏళ్లకే ముసలి వారిలా కనిపిస్తున్నారు.

చెడు జీవన శైలి కారణంగా ఏర్పడే తొలి లక్షణాల్లో చేతిపై ముడతలు ఒకటి. అందమైన, మృదువైన చేతులు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ, వయసు పెరిగే కొద్ది చేతులపై ముడతలు వస్తుంటాయి. ఇది సాధారణ విషయమే. మరో కారణం ఏంటంటే.. చాలా మంది తమ ముఖారవిందాన్ని మాత్రమే పట్టించుకుంటారు. చేతులు, చర్మం సంరక్షణను విస్మరిస్తుంటారు. ఈ కారణంగా కూడా చర్మం త్వరగా ముడతలు పడుతుంది. సరైన సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే.. త్వరగా ముడతలు పెరిగిపోతాయి. చేతులు మృదువుగా, ముడతలు లేకుండా ఉంచడంలో సహాయపడే కొన్ని సులభమైన, ప్రభావవంతమైన ఇంటి నివారణల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం..

కొబ్బరి, బాదం నూనె..

ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు కొబ్బరి, బాదం నూనెను చేతులకు అప్లై చేయండి. దీని కారణంగా, చేతులపై చర్మం మృదువుగా, మెరుస్తూ ఉంటుంది. కొబ్బరి, బాదం నూనెలో విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చేతుల చర్మానికి మేలు చేస్తాయి. వీటిలో ఉండే ఫ్యాట్ ఎలిమెంట్స్ చేతుల చర్మానికి తేమను అందించి హైడ్రేట్ గా ఉంచుతాయి. ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు కొబ్బరి లేదా బాదం నూనెను చేతులకు అప్లై చేయడం వల్ల చర్మానికి పోషణ అందుతుంది. మృదువుగా, మెరుస్తూ ఉంటుంది.

గోరువెచ్చని నీరు, పంచదారతో కడగాలి..

గోరువెచ్చని నీళ్ళు, పంచదారతో వారానికి 2-3 సార్లు చేతులు కడుక్కోవాలి. చక్కెర సహజమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేసి మృత చర్మాన్ని తొలగిస్తుంది.

అలోవెరా జెల్..

అలోవెరా జెల్‌ను చేతులకు అప్లై చేయడం వల్ల ముడతలు తగ్గి చేతులు మృదువుగా ఉంటాయి. కలబందలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఎంజైమ్‌లు డెడ్ స్కిన్‌ని తొలగించి కొత్త చర్మం ఏర్పడేలా చేస్తాయి.

శనగపిండి, నిమ్మకాయ..

వారానికి ఒకసారి శనగపిండి, నిమ్మకాయ మిశ్రమంతో చేతులను మసాజ్ చేయండి. ఇది చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. విటమిన్ బి6, పొటాషియం, మెగ్నీషియం చర్మానికి మేలు చేసే శెనగపిండిలో ఉంటాయి. ఇది చర్మాన్ని బిగుతుగా చేసి మృదువుగా ఉంచుతుంది.

గమనిక:పైన పేర్కొన్న సమాచారం.. బ్యూటీషియన్స్ తెలిపిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఆర్టీవీ ధృవీకరించడం లేదు. ఏమైనా సమస్యలు ఉంటే.. వైద్యులను సంప్రదించి, వారి సలహాలు, సూచనలు పాటించడం ఉత్తమం.

Also Read:

Congress: తెలంగాణపై కాంగ్రెస్ హామీల వర్షం.. సోనియా ప్రకటించిన 6 గ్యారంటీలు ఇవే..

Maruti Fronx: జస్ట్ రూ. 50 వేలు ఉంటే కొత్త కారు మీ సొంతం.. పూర్తి వివరాలు ఇవే..

Advertisment
తాజా కథనాలు