Beauty Tips: ఈ చిన్న చిట్కా మీ కళ్ల అందాన్ని మరింత పెంచుతుంది.. అదేంటో తెలుసుకోండి!

అందంగా, ఆరోగ్యంగా ఉండే కళ్ల కోసం తగినంత నిద్ర అవసరం. మీ కళ్లు ఆకర్షనీయంగా ఉండాలంటే స్క్రీన్‌ సమయాన్ని తగ్గించండి. పండ్లు, కూరగాయలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం అవసరం. హానికరమైన యూవీ కిరణాల నుంచి మీ కళ్లను రక్షించడానికి సన్ గ్లాసెస్ ధరించండి.

New Update
Beauty Tips: ఈ చిన్న చిట్కా మీ కళ్ల అందాన్ని మరింత పెంచుతుంది.. అదేంటో తెలుసుకోండి!

మనసులో ఇతరులు ఏం అనుకుంటున్నారో తెలియలాంటే వారి కళ్లలోకి చూడాలి. కళ్లు ఎప్పుడూ అబద్ధం చెప్పవు. అటు అందం విషయంలోనూ కళ్లే అన్నిటికంటే ఇంపార్టెంట్. కళ్లు అందంగా ఉంటే ఆకర్షనీయంగా కనిపిస్తారు. చాలా మంది కళ్లను చూసే ప్రేమిస్తారు కూడా. ఇది పరిశోధనలు చెబుతున్న మాట. అయితే ప్రస్తుత బిజీ లైఫ్‌ స్టైల్‌లో చాలా మంది కళ్లను పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా గంటల కొద్ది కంప్యూటర్ల ముందు కూర్చొడంతో పాటు ఫోన్‌ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. దీని వల్ల కళ్లు కళను కోల్పోతాయి. కొన్ని చిట్కాలతో కళ్లను మరింత అందంగా ఉండేలా చేసుకోవచ్చు. అవేంటో చూడండి.

వాటర్‌: మంచినీరు తాగడం మీ శరీరానికి ఎంతో అవసరం. అటు అందానికి అంతే అవసరం. ఇటు కళ్లకు అంతకంటే ఎక్కువ అవసరం. హైడ్రేటెడ్‌గా ఉండటం వల్ల మీ కళ్లకు తేమ అందుతుంది. ఇది కళ్లకు రెడ్‌నెస్‌ రాకుండా చేస్తుంది.

ఐ కేర్: హానికరమైన యూవీ కిరణాల నుంచి మీ కళ్లను రక్షించడానికి సన్ గ్లాసెస్ ధరించండి. సన్‌ గ్గాసెస్‌ ఎండ నుంచి మనకి రక్షణ కలిగిస్తాయి.

దోసకాయ ముక్కలు: చల్లని దోసకాయ ముక్కలు మీ కళ్లపై ఉంచడం మంచిది. కళ్ల కింద వాపు ఏమైనా ఉన్నాకూడా తగ్గుతుంది. మన కళ్లకు తేమ అందేలా చేస్తుంది. దోసకాయ ముక్కలను మీ కళ్లపై పెట్టుకుని పడుకోవడం వల్ల విశ్రాంతి పొందుతున్న ఫీలింగ్ కలుగుతుంది. మిమ్మల్ని రిలాక్స్‌ చేస్తుంది.

ఆరోగ్యకరమైన ఆహారం: పండ్లు, కూరగాయలతో కూడిన సమతుల్య ఆహారం కంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహించే అవసరమైన విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. అందుకే ఫ్రూట్స్‌ ఎక్కువ తింటే మంచిదని చెబుతుంటారు. ఇవి కళ్లతో పాటు శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.

కనుబొమ్మలు: మీ కనుబొమ్మలపై మరింత దృష్టి పెట్టండి. మంచి లుక్‌ కోసం బ్యూటిషియన్‌ని సంప్రదించండి

ఒత్తిడి: స్క్రీన్ సమయాన్ని తగ్గించండి, క్రమం తప్పకుండా విరామం తీసుకోండి. లేకపోతే కంటి ఒత్తిడి పెరుగుతుంది. స్క్రీన్‌ యూజ్‌ చేస్తున్నప్పుడు బ్రైట్‌నెస్‌ ముఖ్యం. ప్రస్తుతం చాలా మంది చేసేవి కంప్యూటర్‌ రిలేటెడ్‌ జాబ్స్‌. అందుకే ఎక్కువ సమయం స్క్రీన్ ముందే గడపాల్సి వస్తోంది. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం మస్ట్.

తగినంత నిద్ర: ఇది అన్నిటికంటే ముఖ్యం. కళ్ల అందానికి ఎంత చేసినా తగినంత నిద్ర లేకపోతే మాత్రం మీ ప్రయత్నాలన్ని వృధానేనని గుర్తుపెట్టుకోండి. కళ్లు అందంగా కనపడాలంటే కచ్చితంగా తగినంత నిద్ర అవసరం. లేకపోతే కళ్లు రెడ్‌గా కనిపిస్తాయి. అసలు ఆకర్షనీయంగానే ఉండవు.

Also Read: చంద్ర దోషం పట్టిందా? అయితే ఈ వస్తువులను దానం చేయండి..!

Advertisment
Advertisment
తాజా కథనాలు