Bear in Karimnagar : జనాన్ని పరుగులు పెట్టిస్తున్న ఎలుగుబంటి..వీడియో వైరల్ !

కరీంనగర్ జిల్లాలో జనం మధ్య ఎలుగుబంటి సంచరించడం తీవ్ర కలకలం రేపుతోంది. శుక్రవారం రాత్రి బొమ్మకల్ పంచాయతీ పరిధిలో ఉన్న రజ్వీ చమాన్ ప్రాంతంలోని ఓ కాలనీలో ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. అక్కడ నడిరోడ్డుపై సంచరిస్తూ జనాలను పరుగులు పెట్టించింది. శనివారం ఉదయం కల్లా ఆ ఎలుగుబంటి రేకుర్తిలో నడిరోడ్డులో ప్రత్యక్షమై హల్ చల్ చేస్తోంది. ఎలుగుబంటి కోసం అటవీశాఖ అధికారులు సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్...

New Update
Bear in Karimnagar : జనాన్ని పరుగులు పెట్టిస్తున్న ఎలుగుబంటి..వీడియో వైరల్ !

Bear in Karimnagar : కరీంనగర్ జిల్లాలో జనం మధ్య ఎలుగుబంటి సంచరించడం తీవ్ర కలకలం రేపుతోంది. శుక్రవారం రాత్రి బొమ్మకల్ పంచాయతీ పరిధిలో ఉన్న రజ్వీ చమాన్ ప్రాంతంలోని ఓ కాలనీలో ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. అక్కడ నడిరోడ్డుపై సంచరిస్తూ జనాలను పరుగులు పెట్టించింది.

ఇక శనివారం ఉదయం కల్లా ఆ ఎలుగుబంటి (Bear) రేకుర్తిలో నడిరోడ్డులో ప్రత్యక్షమై హల్ చల్ చేస్తోంది. ఈ క్రమంలో ఎలుగుబంటి ఎక్కడి నుంచి ఎటాక్ చేస్తుందోనని నగరవాసులు హడలెత్తిపోతున్నారు. ఇళ్ల తలుపులను మూసుకున్నారు. మరోవైపు ఎలుగుబంటి కోసం అటవీశాఖ అధికారులు సెర్చ్ ఆపరేషన్ ను మొదలుపెట్టారు.

దాన్ని పట్టుకునేందుకు చుట్టూ వలలు ఏర్పాటు చేశారు. అయితే ఎలుగుబంటి ఇళ్ళ మధ్య ఉన్న చెట్ల పొదల మధ్యలో ఉన్నట్టుగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఇక ఎలుగుబంటి రోడ్డు పై సంచరిస్తూ.. జనాలను వెంటాడుతున్న.. నగరవాసులు పరుగులు పెడుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Also Read: చిరుతనా? ఎలుగుబంటినా? లక్షిత మరణానికి కారణం ఏంటి?

Advertisment
తాజా కథనాలు