Mobile Tips: వేసవిలో ఫోన్‌తో జాగ్రత్త! సమ్మర్ సీజన్‌లో ఫోన్ మరింత ఎక్కువ హీటెక్కడమేకాకుండా, త్వరగా హ్యాంగ్ అవుతుంది కూడా. అంతేకాదు మొబైల్ హీటింగ్‌ను సరిగా కంట్రోల్ చేయకపోతే కొన్నిసార్లు పేలిపోయే ప్రమాదం కూడా ఉంది. మొబైల్ ఫోన్స్ పనితీరు అనేది టెంపరేచర్‌ను బట్టి కూడా మారుతుంటుందని మీకు తెలుసా? By Durga Rao 25 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Tips to Protect Your Phone in Summer: గది ఉష్ణోగ్రత చల్లగా ఉన్నప్పుడు మొబైల్ కాస్త వేగంగా పనిచేస్తుంది. బ్యాటరీ కూడా కాస్త ఎక్కువసేపు వస్తుంది. అయితే ఎండాకాలంలో దీనికి రివర్స్‌లో జరుగుతుంది. అంతేకాదు ఎండాకాలం మొబైల్‌తో కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. అవేంటంటే. సమ్మర్ సీజన్‌లో ఫోన్ మరింత ఎక్కువ హీటెక్కడమేకాకుండా, త్వరగా హ్యాంగ్ అవుతుంది కూడా. అంతేకాదు మొబైల్ హీటింగ్‌ను సరిగా కంట్రోల్ చేయకపోతే కొన్నిసార్లు పేలిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ సీజన్‌లో మొబైల్ వాడకం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మస్ట్. సాధారణంగా మొబైల్ టెంపరేచర్ అనేది 32 నుంచి 36 డిగ్రీల సెంటిగ్రేట్ ఉండాలి. అయితే సమ్మర్‌లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకూ పెరుగుతాయి. కాబట్టి మొబైల్ హీట్ కూడా నాలుగైదు డిగ్రీలు పెరుగుతుంది. దీనివల్ల మొబైల్ బ్యాటరీ త్వరగా అయిపోతుంది. ఇలా హీటెక్కినప్పుడు ఛార్జింగ్ పెడితే మొబైల్ మరింత హీట్ అయ్యే అవకాశం ఉంది. ఇది కొన్నిసార్లు ప్రమాదాలకు దారితీయొచ్చు. అందుకే సమ్మర్‌లో ఛార్జింగ్ పెట్టేందుకు నిర్ణీతమైన సమయాలు కేటాయించుకోవాలి. Also Read: బీహార్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి మొబైల్ వేడిగా ఉందని గమనించినప్పుడు వెంటనే మొబైల్ పౌచ్ తీసివేసి మొబైల్‌ను వాడకుండా లాక్ చేయడం మంచిది. మొబైల్ హీట్ ఎక్కినప్పుడు కాసేపు పక్కనుంచి, హీట్ తగ్గాక చార్జ్ చేయాలి. ఎట్టిపరిస్థుతుల్లోనూ చార్జింగ్ పెట్టి మొబైల్ వాడకూడదు. ఫోన్‌ను వేడిగా ఉండే ప్రాంతంలో లేదా వేడిగా ఉండే గదిలో ఛార్జ్ చేయకపోవడమే మంచిది. అలాగే మధ్యాహ్నం సమయంలో కూడా ఛార్జింగ్ పెట్టొద్దు. ఒకవేళ గదిలో ఏసీ ఉంటే పర్వాలేదు. మొబైల్‌కు డూప్లికేట్ ఛార్జర్, కేబుల్‌ను వాడడం ద్వారా చార్జింగ్ పెట్టేట్పపుడు మరింత ఎక్కువ హీట్ అవ్వడమే కాక బ్యాటరీ కూడా త్వరగా పాడైపోతుంది. ఇకపోతే సమ్మర్‌లో బయట ఎండకు తిరిగేటప్పుడు మొబైల్ వాడకుండా ఉంటేనే మంచిది. నేరుగా ఎండ పడడం వల్ల మొబైల్ మరింత వేగంగా హీటెక్కడంతోపాటు ఫోన్ స్క్రీన్ కూడా దెబ్బతింటుంది. #phone #summer మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి