BCY పార్టీలోకి భారీ వలసలు.. ఇప్పటికే 42 మందికి సీట్లు కన్ఫర్మ్ By srinivas 09 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణ ఎన్నికల సంగ్రామంలోకి దిగిన భారత చైతన్య యువజన పార్టీకి అనూహ్య స్పందన లభిస్తోంది. ఆ పార్టీ అధినేత బొడే రామచంద్ర యాదవ్ ఇప్పటికే రెండు విడతలుగా 42 మంది అభ్యర్ధులను ప్రకటించారు. వివిధ నియోజకవర్గాల నుండి బీసీవై పార్టీ నుండి పోటీ చేసేందుకు నేతలు ముందుకు వస్తున్నారు. ఏ రాజకీయ పార్టీతో పొత్తు లేకుండా బీసీవై పార్టీ ఒంటరిగా అన్ని నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు బీసీవై పార్టీ పట్ల ఆకర్షితులు అవుతున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ షర్మిల) నుంచి రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నేతలు వారి అనుచరులతో బీసీవై పార్టీలో చేరారు. వీరికి పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. బీసీవై పార్టీలో చేరిన నేతలకు ప్రాధాన్యత కల్పిస్తామని పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ హామీ ఇచ్చారు. పార్టీ అభ్యర్ధుల విజయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. తొమ్మిది నియోజకవర్గాలకు చెందిన వైఎస్ఆర్ టీపీ ఇన్‌ఛార్జ్ ఆ పార్టీకి రాజీనామా చేసి బీసీవై పార్టీలో చేరారు. Also read : Sharmila vs KCR: కేసీఆర్ తెలంగాణ ద్రోహి.. ‘ఆ మాట ఎందుకు చెప్పలేకపోతున్నాడు’- షర్మిల! సిద్దిపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఏదుల నర్శింహరావు, కూకట్ పల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ సంజీవరావు, నరసాపూర్ ఇన్‌ఛార్జ్ గౌరగారి ఆగమయ్య, దుబ్బాక ఇన్ చార్జి యల్లా శ్రీనివాసరెడ్డి, ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వై రమణ, మేడ్చల్ ఇన్ చార్జి పాకల డానియేల్, అల్లాపూర్ ఇన్‌ఛార్జ్ అయ్యప్ప సునీల్, సికింద్రాబాద్ పార్లమెంటరీ కోఆర్డినేటర్, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు గద్దల డేవిడ్ రాజు, రాష్ట్ర వైఎస్ఆర్ టీపీ నాయకులు రఘు, రాజ్ కుమార్, కిరణ్, అలగ్జాండర్, రహమతుల్లా, రవీంద్ర తదితరులు బీసీవై పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. అనూహ్యంగా మారిన తెలంగాణా రాజకీయ ముఖచిత్రం పెద్ద పార్టీలతో తలపడటానికి వైఎస్ఆర్ టీపీ, టీడీపీ లాంటి పెద్ద పార్టీ లే తలపడలేని ఈ పరిస్థితులలో అతి తక్కువ వ్యవధి లోనే పార్టీని స్థాపించి ప్రభంజనం సృష్టిస్తున్న BCYపార్టీ 119 స్థానాలలో అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉండటం విశేషం. కాగా భారీ చేరికలు చూస్తుంటే తెలంగాణాలో BCY మరో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగబోతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే BCY పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ బోడె రామచంద్ర యాదవ్ గారికి తెలంగాణ ప్రజల పట్ల వున్న అవగాహనతో అంచనాలకు మించి పార్టీనీ దూకుడుగా ముందుకు తీసుకెళ్తాడని పలువురు అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. #bcy-party #bode-ramachandra-yadav #42-seats-confirmed మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి