IPL 2024 New Rule: పరుగులు వరదలా పారే ఐపీఎల్ వంటి మ్యాచ్‌లో బ్యాటర్ మంచి ఊపులో ఉన్నప్పుడు.. సాధారణంగా ఏ బౌలరైనా ఏంచేస్తాడు! ఓ బౌన్సర్ విసిరి ఆ జోరుకు కళ్లెం వేసేందుకు ప్రయత్నిస్తాడు. కానీ, ఆ చాన్స్ ఓవర్‌లో ఒక్కసారే ఉంటుంది. దీంతో బ్యాటర్ల డామినేషన్‌కే ఎక్కువ అవకాశముంది. అయితే, బీసీసీఐ తాజా నిర్ణయం బౌలర్లకు అడ్వాంటేజ్ కాబోతోంది.
ఐపీఎల్‌లో మార్పుల పరంపర కొనసాగుతోంది. లాస్ట్ టైం ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను తీసుకొచ్చిన బీసీసీఐ వచ్చే సీజన్‌లో మరో కొత్త రూల్ తీసుకొస్తోందట. ఇకనుంచి బౌలర్లు ఓవర్‌కు రెండు బౌన్సర్లు సంధించవచ్చట. ఐపీఎల్ 17వ సీజన్‌లోనే ఈ నిబంధనను అమలు చేసే అవకాశముందని పలు ఇంగ్లిష్ వెబ్‌సైట్లు తమ కథనాల్లో పేర్కొన్నాయి.
ఇది కూడా చదవండి: కళ్లు చెదిరే రికార్డు ధర..రూ.20.5 కోట్లకు పాట్ కమ్మిన్స్ ను కొనుగోలు చేసిన SRH!
బ్యాటర్ల డామినేషన్ పెరిగిపోవడంతో బీసీసీఐ ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చిందని భావిస్తున్నారు. ఈ నిబంధన అమలైతే ఐపీఎల్ గేమ్‌లు మరింత రసవత్తరంగా మారనున్నాయి. అయితే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇప్పటికే ఈ నిబంధనను ట్రైచేసి చూశారు. వచ్చే ఐపీఎల్‌లో దీన్ని అమలు చేయడంపై బీసీసీఐ ఆల్రెడీ ఓ నిర్ణయానికొచ్చినట్లు సమాచారం. ఆరు బంతుల్లో రెండు బౌన్సర్లను ప్రయోగించే అవకాశమిస్తే బ్యాటర్లకు ముకుతాడు పడ్డట్టేనంటున్నారు క్రికెట్ నిపుణులు.
ఇది కూడా చదవండి: ఐపీఎల్ చరిత్రలో రికార్డు ధర.. రూ.24.75 కోట్లకు అమ్ముడుపోయిన ఆస్ట్రేలియా స్టార్!
ఐసీసీ వన్డే మ్యాచ్‌లు, టెస్ట్ మ్యాచ్‌లలో ఓవర్‌కు రెండు బౌన్సర్లను ఇప్పటికే అనుమతిస్తుండగా.. టీ20 ఫార్మాట్‌లో ఒక బౌన్సర్‌కే పర్మిషన్ ఉంది. కొత్త రూల్ అమలైతే పొట్టి క్రికెట్‌లో కూడా అందుకు అవకాశముంటుంది.
ఓవర్‌కు రెండు బౌన్సర్లకు అనుమతిస్తే అది మంచి పరిణామం అవుతుందని టీమిండియా పేస్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ అన్నాడు. ఈ వార్తలపై స్పందించిన జయదేవ్ ఇది బౌలర్లకు అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుందన్నాడు. ముఖ్యంగా బౌలర్లకు డెత్ ఓవర్లలో ఇదొక ఆయుధంగా ఉపయోగపడుతుందని ఓ టీవీ చానల్‌తో చెప్పుకొచ్చాడు.