మరికొద్ది రోజుల్లో పండుగలు మొదలవుతుంటే..క్రికెట్ అభిమానులకు మాత్రం అసలైన పండుగలు అంటే అక్టోబర్ 5 నుంచి మొదలు కానుంది. ఆ పండుగకు వేదిక కూడా భారత్ నే కానుండడంతో వారి ఆనందానికి హద్దులు లేకుండా పోతుంది. వన్డే వరల్డ్ కప్ మొదలవుతుండడంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సహం వెయ్యింతలు అవుతుంది.
ఇప్పటికే వరల్డ్ కప్ తొలి దశ టికెట్లను బీసీసీఐ విక్రయించగా..అవన్నీ కూడా హాట్ కేకుల్లా నిమిషాల వ్యవధిలోనే అమ్ముడుపోయాయి. దీంతో టికెట్లు దొరకని అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో వారికి మరో సువర్ణవకాశన్ని కల్పించింది బీసీసీఐ. అందుకే శుక్రవారం మరోసారి టికెట్లు విక్రయిస్తున్నట్లు తెలిపింది.
మరి కొద్ది రోజుల్లో ప్రపంచ కప్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో బీసీసీఐ చీఫ్ సెక్రటరీ జై షా మాస్టర్ సచిన్ టెండూల్కర్ ను కలిశారు. సచిన్ కు షా గోల్డెన్ టికెట్ ను అందజేశారు. ఈ టికెట్ అందుకున్న వారికి వరల్డ్ కప్ మ్యాచ్ లను చూసేందుకు వీఐపీ యాక్సెస్ ఉంటుంది.
భారత్ లోని ప్రముఖులను ఆహ్వానించడం కోసం బీసీసీఐ గోల్డెన్ టికెట్లను అందజేస్తోంది. ముందుగా అమితాబ్ బచ్చన్ కు ఈ గోల్డెన్ టికెట్ ను అందించారు. తాజాగా సచిన్ కు ఈ టికెట్ ను అందజేసారు షా. సుమారు క్రికెట్ ప్రపంచంలో 20 ఏళ్లు సేవలు అందించిన సచిన్ కు గోల్డెన్ టికెట్ అందించి బీసీసీఐ గౌరవించింది.
‘గోల్డెన్ టికెట్ ఫర్ ఇండియా ఐకాన్స్’ ప్రోగ్రాంలో భాగంగా బీసీసీఐ గౌరవ కార్యదర్శి జై షా.. భారతరత్న సచిన్ టెండుల్కర్‌కు గోల్డెన్ టికెట్‌ను అందజేశారు. సచిన్ క్రికెట్ ప్రయాణం తరాలను ఇన్‌స్పైర్ చేసింది. ఇప్పుడు ఆయన ఐసీసీ వరల్డ్ కప్‌లో భాగం కానున్నారు’ అని బీసీసీఐ ట్విట్టర్ వేదికగా తెలిపింది.