IND vs SA: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ నుంచి ద్రవిడ్ కు రెస్ట్.. హెడ్ కోచ్ ఎవరో తెలుసా? సౌతాఫ్రికాతో పర్యటనలో టీమిండియా ప్లేయర్లు బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. టీ20లో హోరాహోరీగా తలపడి చెరో విజయంతో ఇరుజట్లూ సమఉజ్జీలుగా నిలవడంతో అందరి దృష్టీ వన్డే సిరీస్ పైనే ఉంది. ఈ సిరీస్ కోసం పలు మార్పులు చేసిన యాజమాన్యం హెడ్ కోచ్ గా ద్రవిడ్ స్థానంలో మరొకరిని నియమించింది. By Naren Kumar 16 Dec 2023 in స్పోర్ట్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Sitanshu Kotak: సౌతాఫ్రికాతో పర్యటనలో టీమిండియా ప్లేయర్లు బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. టీ20లో హోరాహోరీగా తలపడి చెరో విజయంతో ఇరుజట్లూ సమఉజ్జీలుగా నిలవడంతో వన్డే సిరీస్ పైనే అందరి దృష్టీ నెలకొని ఉంది. తొలి మ్యాచ్ డిసెంబరు 17న జొహన్నస్‌బర్గ్ వేదికగా జరగనుంది. ఈ సిరీస్ కు సంబంధించి టీం మేనేజ్మెంట్ కొన్ని కీలకమైన మార్పులు చేసింది. వన్డే సిరీస్ కోసం టీం ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కు రెస్ట్ ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, ద్రవిడ్ స్థానంలో ఈ సారి వీవీఎస్ లక్ష్మణ్ కు కాకుండా మరొకరికి అవకాశమిచ్చింది. ఇది కూడా చదవండి: ముంబై టీమ్‌లో ఇంటర్నెల్ వార్? బుమ్రా, సూర్య పోస్టులు వైరల్! ద్రవిడ్ స్థానంలో ఎవరొస్తారు? సౌతాఫ్రికా పర్యటనలో టీ20 సిరీస్ కు ప్రధాన కోచ్ గా వ్యవహరించిన రాహుల్ ద్రవిడ్ కు వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. ద్రవిడ్ స్థానంలో సౌరాష్ట్ర మాజీ ప్లేయర్ సితాన్షు కోటక్ ను ప్రధాన కోచ్ గా బీసీసీఐ నియమించింది. దీంతో కోటక్ వన్డే సిరీస్ లో కోచ్ గా బాధ్యతలు నిర్వర్తించబోతున్నాడు. ఇదిలా ఉండగా, వన్డే సిరీస్ లో అజయ్ రాత్రా, రాజిబ్ దత్తా ఫీల్డింగ్, బౌలింగ్ కోచ్ లుగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం వీరంతా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ స్టాఫ్ గా ఉన్నారు. ఇది కూడా చదవండి: ధోనీ వర్సెస్ రోహిత్ ఎపిక్ క్లాష్‌కి ఎండ్‌కార్డ్.. ఫ్యాన్స్ ఎమోషనల్! లక్ష్మణ్ కాదని అతడికి చాన్స్ ఇటీవల హెడ్ కోచ్ గా ద్రావిడ్ కు రెస్టిచ్చిన ప్రతిసారీ వెరీ వెరీ స్పెషల్ వీవీఎస్ లక్ష్మణ్ ను ఆ స్థానంలో బీసీసీఐ నియమిస్తోంది. అయితే, ఈసారి మాత్రం ఆశ్చర్యకరంగా టీం మేనేజ్మెంట్ కొత్తవాళ్లకు అవకాశమివ్వడం గమనార్హం. ఇది ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చనీయంగా మారింది. #rahul-dravid #vvs-lakshman #sitanshu-kotak మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి