Bengaluru Rains: భారీ వర్షాల నేపథ్యంలో బెంగళూరు మహానగర పాలికే (BBMP) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు వరదలతో నిండిన అండర్‌పాస్‌లలో మునిగిపోకుండా ముందస్తుగా ప్రమాదాలను తగ్గించడానికి మెరుగైన చర్యలు చేపట్టింది. మూడు రకాల నివారణ చర్యలు అమలు చేయనుంది.
భారీ వర్షాల సమయంలో ప్రజలు అండర్‌పాస్‌లలో మునిగిపోకుండా, ప్రమాదాలను తగ్గించేందుకు బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) ముందస్తు చర్యలు చేపట్టింది. గత సంవత్సరం KR సర్కిల్ వద్ద వరద అండర్‌పాస్‌లో ఒక మహిళ మునిగిపోయిన సంఘటనతో ఈ చొరవ తీసుకుంది. ఈ అండర్‌పాస్‌ల భద్రతా ఆడిట్‌ను BBMP ఇంజనీర్-ఇన్-చీఫ్ BS ప్రహ్లాద్ నిర్వహించారు. ఇందులో ప్రమాదాలను తగ్గించడానికి మూడు రకాల నివారణ చర్యలు అమలు చేయబడ్డాయి. ఎరుపు రంగు టేపులు లేదా పెయింట్‌తో ప్రమాద స్థాయిలను గుర్తించడం, మార్కింగ్ లేకుండా అండర్‌పాస్‌లలోకి ప్రవేశించకుండా ఉండటం ప్రాముఖ్యత గురించి ప్రహ్లాద్ వివరించారు. ఇది నేల నుంచి 1.5 అడుగుల నుంచి 2 అడుగుల వరకు గుర్తించబడిన ప్రమాద స్థాయిని అధిగమించే నీటి మట్టాలను సూచిస్తుందని తెలిపారు. ప్రమాద గుర్తులను గమనించి అండర్‌పాస్‌ల్లోకి ప్రవేశించాలని ప్రజలను కోరింది.