Salt Water: సాల్ట్ వాటర్ తో స్నానం చేస్తే.. ఆ సమస్యలు పరార్!

ఉప్పునీటిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఉదయం, సాయంత్రం ఈనీటితో స్నానం చేయడం వల్ల వర్షాకాలంలో శరీరం పరిశుభ్రంగా ఉంటుంది. ఇన్ఫెక్షన్లు, ఒత్తిడి, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అంతేకాకుండా చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండంతో పాటు ముఖ సౌందర్యం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.

Salt Water: సాల్ట్ వాటర్ తో స్నానం చేస్తే.. ఆ సమస్యలు పరార్!
New Update

Salt Water: వర్షాకాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. లేకపోతే అనేక సమస్యలు వస్తాయి. అయితే ప్రతి ఒక్కరూ ఉదయం సాయంత్రం స్నానం చేస్తూ ఉంటారు. ఈ సీజన్లో సమస్యలు రాకుండా ఉండాలటే స్నానం చేస్తే నీటిలో కొద్దిగా ఉప్పు వేస్తే మంచిది. ఉప్పనీటిలో ఆరోగ్యం కరమైన పోషకాలు ఉంటాయి. దీనివల్ల అనేక సమస్యలు తొలగిపోయి శరీరానికి ఉపశమనం ఇస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఉప్పు నీటిలో వేసి స్నానం చేయటం వల్ల కలిగే ఫలితాలు గురించి ఇప్పుడు కొన్ని విషయాలు చూద్దాం.

ఉప్పునీటితో స్నానం చేస్తే కలిగే ప్రయోజనాలు:

  • ఉప్పు నీటిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఉప్పు నీటితో స్నానం చేస్తే కీళ్ల నొప్పులు దూరం అవ్వడంతో పాటు ఒత్తిడి తగ్గుతుంది.
  • ఈ ఉప్పుని స్నానం చేసే నీటిలో కలుపుకుంటే శరీరంపై ఏర్పడిన మచ్చలు తగ్గుతాయి.
  • ఉప్పునీటితో స్నానం చేస్తే ముఖంపై ఉన్న మడతలు తొలగిపోవడంతో పాటు మంచి ఫలితం ఉంటుంది.
  • ఉప్పు నీటితో స్నానం చేస్తే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఎముకల్లో చిన్నపాటి నొప్పులు కూడా పోతాయి.
  • పాదాల నొప్పి ఉంటే గోరువెచ్చని ఉప్పునీటితో కాళ్లు కడుక్కుంటే ప్రయోజనం ఉంటుంది. కాళ్ల వేళ్ళ మధ్యలో ఉన్న మురికిని  పోతుంది.
  • ఉప్పులో ఉన్న సొడియం చర్మానికి మంచి ఫలితం నిస్తుంది. ఉప్పునీరుతో స్నానం చేస్తే శ్వేత రంధ్రాలు తెరుచుకొని శరీరంలోని మురికి బయటకు వస్తుంది.
  • ఈ నీరు ముఖంపై ఉన్న మచ్చలు, మొటిమలు తగ్గించి చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.
  • ఈ నీరు వాడటం వల్ల చర్మం అందంగా ఆరోగ్యంగా ఉండంతోపాటు ముఖ సౌందర్యం పెరుగుతుంది.
  • వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లకు ఉప్పునీరు చాలా బాగా పనిచేస్తుంది. ఈ నీటితో ప్రతీరోజూ ఉదయం, సాయంత్రం స్నానం చేస్తే శరీరం పరిశుభ్రంగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ల, ఒత్తడి ప్రమాదం తగ్గి మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: అరటి పండు తింటే.. ఎన్ని లాభాలో తెలుసా?

#salt-water
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe