Marriage: ప్రస్తుత కాలంలో పెళ్లికాని ప్రసాదులు ఎంతోమంది ఉన్నారు. పూర్వంకాలంలో పెళ్లిళ్లు అంటే ఒక పద్ధతి ఉండేది. కానీ ఈ రోజుల్లో ఆ ట్రెండ్‌ని పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే పెరిగిన టెక్నాలజీ, మనుషుల్లో రకరకాలు కోరికలు, ఆర్థిక ఇబ్బందులు వంటి నేటి కాలంలో ఎంతోమంది చూస్తున్నారు. కొందరైతే ప్రేమ వివాహాలు చేసుకున్నా.. పట్టుమని 16 ఏళ్లు కూడా సంతోషంగా ఉండలేకపోతున్నారు. అయితే.. కొంతమంది పెళ్లి చేసుకొని అడ్జస్ట్ కాలేక గొడవలు పడి విడిపోతుంటే.. మరికొందరు పెళ్లి కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. దీనికోసం ముఢ నమ్మకాలు నమ్మటం, పూజలు, పుణ్య క్షేత్రాలకు వెళ్లటం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే.. కొన్ని మూఢ నమ్మకాలు కూడా మన జాతకాన్ని నమ్మేల చేస్తాయి. ఇలాంటి విషయాలు చెబితే ఇంకా ఈ కాలంలో కూడా ఇలాంటి ఫాలో అవుతారని అని చిన్న చూపు చూసేవాళ్లు ఉన్నారు. కానీ వాటిల్లో కూడా నిజం ఉందని కొందరూ నమ్ముతారు. మీలో కూడా పెళ్లికాని యువతి, యువకులు ఉంటే ఒక్కసారి ఓంకార క్షేత్రానికి వెళ్లి తిరాల్సిందే. ఇప్పుడు ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం.
శాస్త్రవేత్తలకు అంతు చిక్కని పెద్ద పెద్ద కొండల్లోని నీరు
ఓంకార క్షేత్రానికి మహా పుణ్యక్షేత్రంగా పేరు ఉంది. అక్కడ ప్రజలు శివున్ని ఎంతో ఇష్టంగా కొలుస్తారు. పూర్వం నుంచి ఈ క్షేత్రంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించేవారు. ఈ క్షేత్రం నంద్యాల జిల్లాలో ఉంది. పెద్ద పెద్ద కొండల నుంచి నీరు వస్తుంటే మనకు ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. అంతేకాదు ఈ నీరు ఎక్కడ నుంచి వస్తున్నాయో కూడా ఇప్పటి వరకు శాస్త్రవేత్తలకు అంతు చిక్కదు. ఈ పుణ్యక్షేత్రానికి పెళ్లి కానీ వారువెళ్తే చాలు.. ఫలితం ఖచ్చితంగా ఉంటుందని అక్కడి భక్తులు చెబుతున్నారు.
పంచ బుగ్గల కోనేరులో స్నానం చేయాలి
పూర్వకాలంలో కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోవాలని ఓంకార క్షేత్రానికి వెళ్లేవారు. అక్కడ ఒక నిద్ర చేసి మరుసటి రోజు స్వామి వారికి ప్రత్యేక పూజ చేసేవారట. కాగా.. ఓంకార క్షేత్రంలో స్వామి అమ్మవారి గుడికి ఎదురుగా పంచ బుగ్గల కోనేరు ఉంది. ఎంతో చరిత్ర ఉన్న ఈ కోనేరులో స్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్లకు పూజలు చేస్తే వారికి మంచి జరుగుతుందని ప్రజలకు ఓ నమ్మకం ఉంది. ఈ నమ్మకంతో ఓంకార క్షేత్రానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వెళ్తుంటారు. ఈ కోనేరులో స్నానాలు చేయటం వలన సంతానం లేని వారికి పిల్లలు పుడతారని, పెళ్లి కానీ యువత కచ్చితంగా పెళ్లి జరుగుతుందని పురాణాలు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ఈ విషయం తెలుసుకుంటే ఓడిపోయినా బాధపడరు.. మరి తెలుసుకోండి!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.