Sankranti Bath: సంక్రాంతి రోజు ఆ టైమ్‌కి స్నానం చేస్తే పట్టిందల్లా బంగారమే

మకర సంక్రాంతి రోజున రేపు ఉదయం 9:14 నుంచి సూర్యాస్తమయం వరకు అత్యంత శుభప్రదమైనది. ఈ ముహూర్తంలో గంగా, గోదావరి, సంగమం సహా అన్ని పుణ్యనదులలో స్నానం చేయడం వల్ల కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

Sankranti Bath: సంక్రాంతి రోజు ఆ టైమ్‌కి స్నానం చేస్తే పట్టిందల్లా బంగారమే
New Update

Sankranti Bath: మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తున్నాడని వేద పండితులు చెబుతున్నారు. ఉదయం 9:13 గంటలకు సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. రేపు ఉదయం 9:14 నుంచి సూర్యాస్తమయం వరకు, ప్రజలు నదీ స్నానం చేయవచ్చు. అలాగే ఉదయం 9:20 నుంచి 10:05 వరకు ఉన్న సమయం అత్యంత శుభప్రదమైనది. ఈ ముహూర్తంలో గంగా, గోదావరి, సంగమం సహా అన్ని పుణ్యనదులలో స్నానం చేయడం వల్ల కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

 పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుంది:

మకర సంక్రాంతి సందర్భంగా.. పవిత్ర నదిలో స్నానం చేసిన తర్వాత, తప్పనిసరిగా బెల్లం, నువ్వులు, అన్నం అవసరమైన వారికి దానం చేయాలి. దీని ద్వారా పూర్వీకుల ఆశీర్వాదం పొంది పుణ్యం లభిస్తుంది. పాపాల నుంచి విముక్తి కోసం ఈ రోజు చాలా ముఖ్యమైనదని అంటున్నారు. సంక్రాంతి అంటే నూతన క్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణమంటారు. ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. అయితే.. పన్నెండు రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో పన్నెండు సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటపుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అని కూడా అంటారు. ఇలా ప్రతి నెల ఒక సంక్రాంతి వస్తుంది.

కష్టాలు తొలగిపోతాయి:

ఈ సంక్రాంతి పండగను మూడు రోజులు సంతోషంగా జరుపుకుంటారు. ఆదివారం భోగి, సోమవారం మకర సంక్రాంతి, మంగళవారం కనుమ, కొన్ని ప్రాంతాల్లో4వ రోజు బుదవారం ముక్కనుమగా చేసుకుంటారు. ఈ మూడు రోజులలో ఈ రోజు బోగిమంటలతో, రేపు పొంగలి, పిండివంటలతో, పితృ దేవతల, దేవుళ్ళ పూజలతో, ఎల్లుండి గో పూజలు, మాంసం ప్రియులకు మంచి కూరలతో, ఈ సంక్రాంతి పండుగ చేసుకుంటారు.

ఇది కూడా చదవండి: లక్ష్మీదేవి కటాక్షించాలంటే సంక్రాంతికి ఈ పనులు చేయండి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

ఇది కూడా చదవండి: పిల్లలకు భోగిపళ్లు ఎందుకు పోస్తారు..తప్పనిసరిగా పోయాలా?

#health-benefits #sankranti-bath
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe