Sankranti Bath: సంక్రాంతి రోజు ఆ టైమ్‌కి స్నానం చేస్తే పట్టిందల్లా బంగారమే మకర సంక్రాంతి రోజున రేపు ఉదయం 9:14 నుంచి సూర్యాస్తమయం వరకు అత్యంత శుభప్రదమైనది. ఈ ముహూర్తంలో గంగా, గోదావరి, సంగమం సహా అన్ని పుణ్యనదులలో స్నానం చేయడం వల్ల కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. By Vijaya Nimma 14 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Sankranti Bath: మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తున్నాడని వేద పండితులు చెబుతున్నారు. ఉదయం 9:13 గంటలకు సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. రేపు ఉదయం 9:14 నుంచి సూర్యాస్తమయం వరకు, ప్రజలు నదీ స్నానం చేయవచ్చు. అలాగే ఉదయం 9:20 నుంచి 10:05 వరకు ఉన్న సమయం అత్యంత శుభప్రదమైనది. ఈ ముహూర్తంలో గంగా, గోదావరి, సంగమం సహా అన్ని పుణ్యనదులలో స్నానం చేయడం వల్ల కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుంది: మకర సంక్రాంతి సందర్భంగా.. పవిత్ర నదిలో స్నానం చేసిన తర్వాత, తప్పనిసరిగా బెల్లం, నువ్వులు, అన్నం అవసరమైన వారికి దానం చేయాలి. దీని ద్వారా పూర్వీకుల ఆశీర్వాదం పొంది పుణ్యం లభిస్తుంది. పాపాల నుంచి విముక్తి కోసం ఈ రోజు చాలా ముఖ్యమైనదని అంటున్నారు. సంక్రాంతి అంటే నూతన క్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణమంటారు. ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. అయితే.. పన్నెండు రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో పన్నెండు సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటపుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అని కూడా అంటారు. ఇలా ప్రతి నెల ఒక సంక్రాంతి వస్తుంది. కష్టాలు తొలగిపోతాయి: ఈ సంక్రాంతి పండగను మూడు రోజులు సంతోషంగా జరుపుకుంటారు. ఆదివారం భోగి, సోమవారం మకర సంక్రాంతి, మంగళవారం కనుమ, కొన్ని ప్రాంతాల్లో4వ రోజు బుదవారం ముక్కనుమగా చేసుకుంటారు. ఈ మూడు రోజులలో ఈ రోజు బోగిమంటలతో, రేపు పొంగలి, పిండివంటలతో, పితృ దేవతల, దేవుళ్ళ పూజలతో, ఎల్లుండి గో పూజలు, మాంసం ప్రియులకు మంచి కూరలతో, ఈ సంక్రాంతి పండుగ చేసుకుంటారు. ఇది కూడా చదవండి: లక్ష్మీదేవి కటాక్షించాలంటే సంక్రాంతికి ఈ పనులు చేయండి గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఇది కూడా చదవండి: పిల్లలకు భోగిపళ్లు ఎందుకు పోస్తారు..తప్పనిసరిగా పోయాలా? #health-benefits #sankranti-bath మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి