Barrelakka Sirisha Marriage : తెలంగాణ ఎన్నిక(TG Elections) ల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి(Independent Candidate) గా పోటీ చేసిన బర్రెలక్క(Barrelakka) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతి చిన్న వయసులోనే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తెలుగు రాష్ట్రల్లో సంచలనం సృష్టించింది. అయితే, తాజాగా ఈమె మరోసారి తన పెళ్లి(Marriage) తో వార్తల్లో నిలిచింది. ఈ ఉదయం దగ్గరి బంధువైన వెంకటేష్ అనే అబ్బాయితో మూడు ముళ్ళ బంధంలోకి అడుగుపెట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా(Social Media) లో వైరల్ గా మారాయి.
Also Read : యంగ్ హీరో నవీన్ పోలిశెట్టికి అమెరికాలో ప్రమాదం.. తీవ్ర గాయాలు!
ఇటీవలే ‘ఓ శిరీషా.. నా శిరీషా..’ అంటూ తన కోసమే ప్రత్యేకంగా రాయించుకున్న పాటతో ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకుంది. ఈ విడియో రిలీజ్ చేసిన అతి తక్కువ టైంలోనే నెట్టింట్లో మాములు సందడి చేయలేదు. తన ప్రీ వెడ్డింగ్ కోసం ప్రత్యేకంగా రాయించుకొని షూట్ చేయించుకున్న సాంగ్ ను ఇతర ఛానెల్స్ వాళ్ళు వాడుకోవడంతో వారికి గట్టి వార్నింగే ఇచ్చింది. తన సాంగ్ ను యూజ్ చేస్తే స్ట్రైక్ వేస్తానని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ తరువాత వీడియోనూ డిలీట్ చేసింది. అయితే, వీడియో చూసిన నెటిజన్లు మాత్రం రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
ఇదిలా ఉండగా.. ఏ పొలిటకల్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిన్న వయసులోనే కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలిచింది. గెలుపు ఓటములు పక్కన పెడితే తన ధైర్యానికి మాత్రం అందరు ప్రశంసలు కురిపించారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా ఏ మాత్రం తగ్గకుండా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని తేల్చి చెప్పింది. అయితే, ఇంతలోనే పెళ్లి చేసుకోవడంతో ఇక బర్రెలక్క పోటీ చేయనట్లేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీనిపై స్పందించిన బర్రెలక్క తన భర్త తనకు సపోర్టుగా ఉన్నాడని.. ఎంపీగా పోటీ చేస్తానని పేర్కొంది. బర్రెలక్క మరోసారి పోటీలో నిలుస్తాందా? లేదంటే సైలెంట్ ఉండిపోతుందా అనేది వేచి చూడాలి.