RGV - Barrelakka: వరుస వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్న రామ్ గోపాల్ వర్మకు కొత్త చిక్కు వచ్చిపడింది. తెలంగాణలోని కొల్లాపూర్ స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన శిరీష అలియాస్ బర్రెలక్క తరఫు లాయర్ ఆర్జీవీపై కేసు నమోదు చేశారు. వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలను వారు తప్పుబట్టారు. ఈ సభలో రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు శిరీషను కించపరిచేలా అవమానకరంగా ఉన్నాయంటూ బర్రెలక్క తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తపరుస్తూ మహిళా కమిషన్ లో కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: AP: ఏపీలో భారీగా తగ్గిన సైబర్ నేరాలు, అట్రాసిటీ కేసులు.. యాన్యువల్ క్రైమ్ రిపోర్ట్ విడుదల!
మీటింగ్ సందర్భంగా ఆర్జీవీ మాట్లాడుతూ ఊరూ పేరూ లేని ఆమె చాలా ఫేమస్ అయిపోయిందంటూ కించపరిచేలా వ్యాఖ్యానించారని లాయర్ పేర్కొన్నారు. బతకాలనుకుంటే బ్లూ ఫిలిమ్స్ తీసుకునైనా బతుకు గానీ, ఈ ప్రాంత బిడ్డలు ఎదగాలనుకున్న ప్రయత్నాన్ని అవమానించడం తప్పు అంటూ రామ్ గోపాల్ వర్మను ఉద్దేశించి లాయర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే తెలంగాణ నుంచి తరిమి కొడతామని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: YS Sharmila: షర్మిల ఏ పార్టీలో అయినా చేరొచ్చు.. పవన్ సీటును డిసైడ్ చేసేది టీడీపీనే: మంత్రి అమర్నాథ్
ఆర్జీవీ సినిమాలు, వ్యాఖ్యలు ఇటీవల వివాదాస్పదమవుతున్నాయి. ఇటీవలే ఆయన తీసిన వ్యూహం సినిమా ఎంతగా వివాదానికి దారితీసిందో తెలిసిందే. సినిమా విడుదలకు కూడా చాల ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రసంగిస్తున్న సమయంలోనే ఆర్జీవీ బర్రెలక్క విషయాన్ని ప్రస్తావించాడు.